మొబైల్ హ్యాండ్సెట్ తయారీ కంపెనీ వివో మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లు వివో వై12, వివో వై15 మార్కెట్లోకి తీసుకువచ్చింది. రెండు ఫోన్లలోనూ ట్రిపుల్ రియర్ కెమెరా (8 ఎంపీం13 ఎంపీం2 ఎంపీ) ఫీచర్ ఉంది. వివో వై12 ఫోన్లో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, వివో వై15 ఫోన్లో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. రెండింటిలోనూ ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి ధర రూ.15,000 వరకు ఉంది. ఇందులో ఉండే ఫీచర్లు... 6.35 అంగుళాల స్క్రీన్, ఫుల్‌వ్యూ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 3 జీబీ/4 జీబీ ర్యామ్, 32 జీబీ/64 జీబీ మెమరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే.. రెండు స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. వీటిల్లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉంది. డ్యూయెల్ 4జీ వీవోఎల్ఈటీ, బ్లూటూత్ 5.0 వంటి ఫీచర్లున్నాయి.