ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ సబ్స్క్రైబర్లకు వినూత్న సేవలను ఉచితంగా అందిస్తోంది. అందుకోసం మరో ఆఫర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు. కేవలం శాంసంగ్ వినియోగదారులకు మాత్రమే వర్తించనుంది. తాజాగా తాజాగా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీతో టైఅప్ పెట్టుకుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్10 సిరీస్ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.6,000 విలువైన నెట్ఫ్లిక్స్ ఏడాది ఉచిత సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. పోస్ట్ పెయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. గెలాక్సీ ఎస్10 అన్ని మోడళ్ల కొనుగోలుపై ఈ సౌకర్యాలు పొందొచ్చు. దీని కోసం వొడాఫోన్ యూజర్లు రూ.499 లేదా ఆపైన రీచార్జ్ ప్లాన్లు కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే శాసంగ్ గెలాక్సీ ఎస్10 సిరీస్ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసిన ప్రిపెయిడ్ యూజర్లకు వేరొక ఆఫర్ అందుబాటులో ఉంది. ఇక్కడ యూజర్లు రోజుకు 2 జీబీ డేటాను ఏడాది పాటు ఉచితంగా పొందొచ్చు. అలాగే అపరిమిత కాల్స్ సౌకర్యం కూడా ఉంది.