టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ స్మార్ట్ఫోన్ వినియోగదారుల కోసం మంచి ఆఫర్ తీసుకు వచ్చింది. 64 జీబీ వేరియంట్ పరంగా గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్ ఫోన్.. గూగుల్ పిక్సల్ 3 కన్నా తక్కువ ధరను తగ్గించింది. గూగుల్ పిక్సల్ 3లో 64 జీబీ వేరియంట్ ధర రూ.12,001 తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్ రూ.58,999కు అందుబాటులో ఉంది. ఫోన్ అసలు ధర రూ.71,000. 128 జీబీ వేరియంట్ ధర ఏకంగా రూ.23,010 దిగొచ్చింది. ఇప్పుడు ఇది రూ.59,990కు కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పిక్సల్ 3 ఎక్స్ఎల్ ఫోన్లో 64 జీబీ వేరియంట్ ధర భారీ రూ.27,501 తగ్గింది. ఇప్పుడు దీన్ని రూ.83,000కు కాకుండా రూ.55,499కు కొనొచ్చు. 128 జీబీ వేరియంట్ ధర రూ.13,000 దిగొచ్చింది. రూ.79,000కు అందుబాటులో ఉంది. 64 జీబీ వేరియంట్ పరంగా గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ ఫోన్.. గూగుల్ పిక్సెల్ 3 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అంటే పిక్సల్ 3 ధర రూ.58,999గా ఉంటే, పిక్సల్ 3 ఎక్స్ఎల్ ధర రూ.55,499గా ఉంది. ఈ ఆఫర్ 2018 మోడళ్లకు వర్తిస్తుంది. ధర తగ్గింపు నిర్ణయం తక్షణం అమలులోకి వచ్చింది.