సోషల్ మీడియా రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో భాగమైన ఇన్స్టాగ్రామ్ నెట్వర్క్ కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల వారికి మరింత చేరువయ్యేందుకు సరికొత్త ఫీచర్‌ను రూపొందించింది. అదే డేటా సేవింగ్ ఫీచర్.. దీని ద్వారా నెట్వర్క్ కవరేజి తక్కువగా ఉన్న ప్రాంతాల వారు సైతం ఇన్‌స్టాగ్రామ్‌ను ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ అయిన ఫొటోలు, వీడియోలు ఎక్కువ రిజల్యూషన్ ఉన్నవి అవసరం అనుకుంటేనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల ఇన్స్టాగ్రామ్ తక్కువ నెట్వర్క్ ఉన్న ప్రాంతాలలో సైతం నిరంతరాయంగా పని చేస్తుంది. దీనిని అందుబాటులోకి తీసుకోవాలంటే 'అకౌంట్'లో 'సెల్యులార్ డేటా యూసేజ్' ఆప్షన్స్‌లో ఈ ఫీచర్ జత చేశారు. ఈ ఫీచర్ కావాలనుకునే వారు సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఆప్షన్ మార్చుకుంటే సరపోతుంది. ఈ ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఆండ్రాయిడ్ వినియోగదారులకు వర్తిస్తుంది.