ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తన సబ్స్క్రైబర్లకు ప్లాన్ ప్రయోజనాలతో పాటు అదనపు సేవలు అందించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఎయిర్టెల్ థ్యాంక్స్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో జీ5 సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో ఎయిర్టెల్ కస్టమర్లు వీడియో ఆన్ డిమాండ్ సేవలు పొందవచ్చు. ఇందులో జీ5 ఒరిజినల్స్, సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలు, లైఫ్‌స్టైల్ షోలు, కిడ్స్ షోలు వంటి వాటికి చూడొచ్చు. ఎయిర్టెల్ ప్లాటినం యూజర్లు మై ఎయిర్టెల్ యాప్‌లోని ఎయిర్టెల్ థ్యాంక్స్ విభాగంలోకి వెళ్లి జీ5 యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఈ సేవలు పొందొచ్చు. ఇకపోతే ఎయిర్టెల్ తన ఎయిర్టెల్ థ్యాంక్స్ స్కీమ్‌ను ఇటీవలే మళ్లీ లాంచ్ చేసింది. సిల్వర్, గోల్డ్ టైర్ యూజర్లకు ఈ సౌకర్యం అందుబాటులో లేదు.