ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ శాంసంగ్.. నోట్‌బుక్ 7, నోట్‌బుక్ 7 ఫోర్స్ అనే రెండు కొత్త ల్యాప్‌టాప్స్‌ను ఆవిష్కరించింది. ఈ ల్యాప్‌టాప్స్‌లో 8వ జనరేషన్ ఇంటెల్ ప్రొసెసర్ ఉంటుంది. నోట్‌బుక్ 7 ఫోర్స్‌లో న్విదియా జీఫోర్స్ జీటీఎక్స్ 1650 గ్రాఫిక్స్, 24 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ. 15.6 అంగుళాల స్క్రీన్ వంటి ప్రత్యేకతలున్నాయి. నోట్‌బుక్ 7లో 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ వంటి ఫీచర్లున్నాయి. నోట్‌బుక్ 7లో 13.3 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఇక రెండింటిలోనూ డాల్బే ఆటమ్స్ ఆడియో, 720పీ హెచ్డీ కెమెరా సహా యూఎస్బీ సీ, యూఎస్బీ 3.0, హెచ్డీఎంఐ 2.0, ఎస్డీ కార్డ్ రీడర్ వంటి కనెక్టివిటీ పోర్ట్స్ ఉంటాయి. మెటల్ ఫ్రేమ్ డిజైన్, ఫుల్ హెచ్డీ రెజల్యూషన్, ఫింగర్‌ప్రింట్ సెన్సర్, బ్యాక్లిట్ కీప్యాడ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి జూలై 26 నుంచి మార్కెట్లోకి రానున్నాయి. ప్రీ ఆర్డర్లు జూలై 12 నుంచి ప్రారంభం అవుతాయి. మొదట కొరియా, హాంగ్‌కాంగ్ మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి. తర్వాత అమెరికా, బ్రెజిల్ వంటి మార్కెట్లోకి రానున్నాయి. వీటి ప్రారంభ ధర గ్లోబల్ మార్కెట్లో దాదాపు రూ.69,000.
Authorization