ఇప్పుడు అందరి స్మార్ట్‌ఫోన్‌లో కనిపించే యాప్ వాట్సాప్. ఇందులో ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లు పంపిస్తుంటారు. అనేక రకాల ఫీచర్లు ఉన్నాయి. షార్ట్ కట్స్ ఉన్నాయి. మెసేజ్‌లు పంపేపుడు బోల్డ్, ఇలాటిక్, అండర్లైన్ వంటివి కూడా టైప్ చేసేపుడు కొన్ని కీస్ ఉపయోగించి చేసి పంపొచ్చు. ఇలాంటి వాటి గురించి కొద్ది మందికే తెలుసు.. అందులో ఒకటే.. వీడియో ఫైల్‌ను ఆడియో ఫైల్‌గా మార్చి పంపించడం. ఇందుకోసం ఎలాంటి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదు. వాట్సప్‌లోనే వీడియోని ఆడియోగా సులువుగా మార్చేయచ్చు.
అదెలా...
వాట్సప్‌లో ఛాట్ విండో ఓపెన్ చేయాలి. టెక్స్ట్ బాక్స్ పక్కన కెమెరా ఐకాన్‌ను క్లిక్ చేయాలి. ఆడియోగా పంపాలనుకున్న వీడియోను సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోను ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పై పక్క పెన్సిల్ టూల్ ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి. దాని కింద భాగంలో కలర్ బార్ ఓపెన్ అవుతుంది. అందులోని ఏదోక కలర్‌ను ఎంచుకోవాలి. తర్వాత రెండు వేళ్ళతో మాత్రమే ఒకేసారి ఎంపిక చేసుకున్న వీడియోపై టచ్ చేయాలి. ఎంపిక చేసుకున్న రంగు ఆ వీడియోపై అప్లై అవుతుంది. వెంటనే సెండ్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. మీరు ఆడియోగా పంపాలనుకున్న వీడియో ఫైల్ ఆడియో రూపంలో చేరుతుంది. వాట్సాప్ స్టేటస్‌లోనూ ఈ విధమైన టెక్నిక్‌ను ఉపయోగించవచ్చు.
Authorization