ఆపరేటింగ్ సిస్టమ్‌లో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్న మైక్రోసాఫ్ట్ నుంచి నుంచి మరో కొత్త వర్షెన్ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్‌లో విడుదల చేసిన ఈ వర్షెన్కు ఇది అప్డేట్ అని చెప్పవచ్చు. విండోస్ ఎన్టీ కి అనుసంధానంగా వస్తున్న విండోస్ 10 వర్షెన్లలలో ప్రస్తుతం వచ్చిన 1903 వర్షెన్‌ను గత నెలలో సంస్థ విడుదల చేసింది. ఇప్పటివరకు విండోస్‌లో వచ్చిన ఫీచర్లతో పాటు కొత్తగా వచ్చిన వర్షెన్ ఇన్స్టాల్ చేసుకునే విధానం తెలుసుకుందామా..
విండోస్ 8.1 తర్వాత మైక్రోసాఫ్ట్ అందించిన మరో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10. దీనిని 2015 జులైలో విడుదల చేసింది. మారుతున్న వర్షెన్లతో పాటు పీసీలతోపాటు ఫోన్లు, టాబ్లెట్స్, ఇతర డివైస్‌లకు ఫీచర్లు సరికొత్తగా అందుబాటులోకి తీసుకువస్తుండడంతో విండోస్ 10 ఉపయోగించేవారు ఎక్కువవుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్లాట్‌ఫామ్‌లలో 40 శాతం పీసీలు, మొబైళ్లు, టాబ్లెట్స్ వంటి వాటిలో విండోస్ 10, పాత వర్షెన్లు ఏదో ఒకటి ఉపయోగిస్తున్నారు.
ఇప్పటివరకు వచ్చిన వర్షెన్లు
1985 నవంబర్‌లో మొదలైన విండోస్ 1.0 నుంచి 2019లో వచ్చిన 10 వరకు అనేక రకాల వర్షెన్లు వచ్చాయి. అందులో విండోస్ 10లో వచ్చినవే ఎక్కువ.
విండోస్ 1 : ఇది గ్రాఫిక్‌ల ఇంటర్ఫేస్లో 16 బిట్‌తో మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చిన మొదటి వర్షెన్. ఇది ఎక్కువగా మౌస్ నియంత్రణపై ఆధారపడి పనిచేసింది. ఆ రోజుల్లో కంప్యూటర్ల వాడకం తక్కువగా ఉండడంతో దీని వినియోగం ఎక్కువగా లేదు.
విండోస్ 2 : రెండేండ్ల తర్వాత 1987 డిసెంబర్లో విడుదలైంది. ''ఐకాన్సింగ్'' లేదా ''జూమింగ్'' బదులుగా విండోలను మినిమైజ్, మాగ్జిమైజ్ చేయడానికి వీలుగా రూపొందించారు. విండోస్ 2లో కంట్రోల్పానెల్, కాన్ఫిగరేషన్ ఆప్షన్లు ఒక చోటు అందుబాటులోకి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్లు ఇందులోనే రూపొందించబడ్డాయి.
విండోస్ 3 : 1990లో ప్రారంభమైంది. ఇందులో హార్డ్‌డ్రైవ్ అవసరం ఉండేలా తయారు చేశారు. ఈ వర్షెన్ యాపిల్ మాకిన్టోష్, కామోడోర్అమిగా గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్‌లకు పోటీగా నిలిచింది. పీసీలకు అనుగుణంగా జెనిత్ డేటా సిస్టమ్స్ తయారీని కలుపుకుని రూపొందితమైంది. ఇందులో ఎంఎస్-డాస్ ప్రొగ్రామ్‌లు ప్రారంభమయ్యాయి. 256 రంగులను పొందుపరుచుకుని, ఆధునిక ఇంటర్ఫేస్తో రూపొందించబడింది. దీనికి అనుబంధంగా 1992లో వచ్చిన 3.1 వర్షెన్‌లో మొదటి సారి 'ట్రూటైప్ ఫాంట్స్'ను పరిచయం చేసింది. ఇందులో మైన్స్వీపర్ కంప్యూటర్ గేమ్ ప్రారంభమైంది. ఎంస్ డాస్‌ను సపోర్ట్ చేస్తూ 1 ఎంబీ ర్యామ్ అవసరం ఉండేలా, సీడీ-రామ్‌గా రూపొందడంతో పాటు హార్డ్ డ్రైవ్‌లో 10 - 15ఎంబీ స్థలంలో ఇన్స్టాల్ చేసే విధంగా మౌస్తో కమాండ్లు ఇచ్చేలా రూపొందించబడింది.
విండోస్ 95 : 1995 ఆగస్టులో విండోస్ 95ను ప్రారంభించారు. ఇందులో స్టార్ట్ బటన్, స్టార్ట్ మెనూలు రూపుదిద్దుకున్నాయి. 32 బిట్ ఎన్విరాన్‌మెంట్‌తో పాటు టాస్క్‌బార్, మల్టీటాస్కింగ్ ఆప్షన్లు ప్రారంభమయ్యాయి. కొన్ని రకాల ప్రొగ్రామ్‌లు, ఎలిమెంట్లలో ఎంఎస్-డాస్ కీలకపాత్ర పోషించింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఇందులోనే ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత వచ్చిన వర్షెన్లలో మాత్రమే పూర్తిగా అందుబాటులోకి వచ్చింది.
విండోస్ 98 : 1998 జూన్‌లో ప్రారంభమై, అవుట్‌లుక్ ఎక్స్‌ప్రెస్, అడ్రస్ బుక్, మైక్రోసాఫ్ట్ చాట్, నెట్షో ప్లేయర్ వంటివి వచ్చాయి. మీడియా ప్లేయర్ 6.2 రెండో వర్షెన్ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇందులో ముందుకు, వెనక్కు వెళ్ళగలిగే నావిగేషన్ ఆప్షన్లు వచ్చాయి. విండోస్ ఎక్స్ప్లోరర్లో అడ్రస్‌బార్ వాడకంలోకి వచ్చింది. వీటితో పాటు అనేక రకాల మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా యూఎస్బీ సపోర్ట్ చెప్పుకోదగినది.
విండోస్ మీ (మిలినియం ఎడిషన్) : విండోస్ 9 ఎక్స్ లైన్‌తో విండోస్ విస్తా, ఎంఎస్ - డాస్ శకం ముగిసింది. 2000 సెప్టెంబర్‌లో మిలినియం ఎడిషన్ ప్రారంభమైంది. ఇందులో కొన్ని రకాల ఆటోమేటిక్ రికవరీ టూల్స్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఐఇ 5.5, విండోస్ మీడియా ప్లేయర్ 7, విండోస్ మూవీ మేకర్ వంటి తొలిసారి ప్రారంభమయ్యాయి. ఇందులోనే. కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వడంలో సమస్యలు తలెత్తాయి.
విండోస్ 2000 : మళ్ళీ మిలీనియం ఎడిషన్, విండోస్ 2000 ఫిబ్రవరి 2000లో ప్రారంభమయ్యాయి. ఇవి మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఓరియంటేటెడ్ సిస్టమ్ విండోస్ ఎన్టీ గా ఏర్పడి తర్వాత విండోస్ ఎక్స్పీగా మారింది.
విండోస్ ఎక్స్పీ : 2001 అక్టోబర్‌లో విడుదలైన విండోస్ ఎక్స్పీ లో ఆకుపచ్చరంగులో ఉండే స్టార్ట్ బటన్, నీలం రంగులో ఉండే టాస్క్‌బార్ ఇక్కడ నుంచే ప్రారరభమయ్యాయి. విస్తా వాల్‌పేపర్, అనేక రకాల విజువల్ ఎఫెక్ట్స్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. టెక్ట్స్ ఎరేజర్‌తో పాటు ఎల్సీడీ స్క్రీన్లు ప్రవేశపెట్టారు. సీడీ బర్నింగ్, సీడీల నుంచి ఆటోమేటిక్‌గా ప్లే అయ్యే ఆప్షన్, ఆటోమేటిక్ అప్డేట్, రికవరీ టూల్స్ వంటివి ప్రారంభమయ్యాయి. 2014 వరకు 3 రకాల మేజర్ అప్డేట్స్ పొంది ఎక్కువ కాలం కొనసాగిన వర్షెన్ ఇదే. ఇప్పటికీ దాదాపు 430 మిలియన్ కంప్యూటర్లలో వాడుతున్నట్టు అంచనా.
విండోస్ విస్తా : 2007 జనవరిలో ప్రారంభమైన విస్తా 'లాంగ్ర్న్' కోడ్నేమ్లో లోపాలు తలెత్తాయి. దీని వాడకం వినియోగదారునికి సమస్యాత్మకంగా మారింది. కానీ డీవీడీ మేకర్, ఫొటో గ్యాలరీలు ఇందులోనే ప్రారంభమయ్యాయి. తర్వాత మరో వర్షెన్‌ను తయారు చేశారు.
విండోస్ 7 : విండోస్ విస్తాలో చేసిన మార్పులతో ఏర్పడిన విండోస్ 7ను 2009 అక్టోబర్‌లో విడుదల చేశారు. విస్తా వల్ల ఏర్పడిన అన్ని సమస్యలను దీని ద్వారా పరిష్కరించారు. దీని వినియోగం సులువుగానూ, వేగవంతంగానూ ఉండడంతో పాటు విండోస్ స్క్రీన్ సైజ్ తగ్గించుకునేందుకు వీలుగా ఉంది.
విండోస్ 8 : 2012 అక్టోబర్‌లో విడుదలైన విండోస్ 8లో ప్రొగ్రామ్స్, ఐకాన్స్ స్థానంలో విడ్జెట్స్ తీసుకురావడంతో పాటు వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండే స్క్రీన్ డిస్ప్లేను పొందుపరిచారు. మిగిలిన అన్నింటి కంటే ఇది చాలా వేగవంతమైన వర్షెన్. యూఎస్బీ డివైస్ 3.0 ను సపోర్ట్ చేసింది. టచ్‌స్క్రీన్‌తో పాటు ఎక్కువగా వినియోగించే యాప్స్ ఫుల్‌స్క్రీన్ మోడ్‌లో ఉండేలా రూపొందింది. కానీ అప్పటికే మొబైల్ ఫోన్లలో ఐపాడ్, స్మార్ట్‌ఫోన్ వంటి చాలా రకాల టచ్స్క్రీన్లు అందుబాటులో ఉండడంతో తక్కువ మొత్తంలోనే ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
విండోస్ 8.1 : 8 అనుగుణంగా వచ్చిన 8.1 అక్టోబర్ 2013లో విడుదల చేశారు. ఇందులో మొదటి దశలో వచ్చిన కొన్ని ఫీచర్లు చేర్చారు. కానీ వినియోగదారులకు ఇవి ఇబ్బందిగా అనిపించడంతో మళ్ళీ స్టార్ట్ బటన్లను ప్రవేశపెట్టారు.
విండోస్ 10 : 2014 సెప్టెంబర్‌లో విండోస్ 10 టెస్ట్ విజన్‌ను కొంత మంది ఆసక్తి కలిగిన వినియోగదారులకు మాత్రమే అందించారు. ఇది విజయవంతం కావడంతో మైక్రోసాఫ్ట్ 2015 నుంచి పూర్తి స్థాయిలో కొన్ని ఆసక్తి గల ఫీచర్లను అందుబాటోకి తీసుకుచ్చింది. కీబోర్డు, మౌస్ మోడ్, టేబుల్మోడ్లలో ఆసక్తి గల మార్పులు చేసింది. అందులో వైర్లెస్ కీబోర్డు ఒకటి. విండోస్ 10ను అన్ని రకాల మొబైల్స్, టాబ్లెట్స్‌లలో మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు 10, 10 ఎస్‌లలో 1507, 1511, 1607, 1703, 1709 ఫీచర్లు పెద్దగా సపోర్ట్ చేయలేదు. కానీ 1803, 1809, 1903 ఫీచర్లు విజయం సాధించాయి. ప్రస్తుతం జూన్ 12, 2019న 20 హెచ్1 వచ్చినా అది ప్రీవ్యూ దశలోనే ఉంది. దీని కంటే ముందు వచ్చిన 1903 కోడ్‌నేమ్ 19 హెచ్1 మాత్రం జూన్ 7 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది.
అందుబాటులోని ఫీచర్లు
విండోస్ 10 లైట్ థీమ్, రివర్స్డ్ స్టోరేజీ, విండోస్ శాండ్ బాక్స్, రికమండెడ్ ట్రబులింగ్, ఆటోమేటిక్ యాక్టివ్ అవర్స్, పాస్ విండోస్ అప్డేట్, క్విక్ యాసెస్ సింబల్స్, విండోస్ 10 సెర్చ్, మౌస్ కస్టమైజేషన్, బ్రైట్నెస్ కంట్రోల్ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
కావాల్సినవి..
ఈ ఫీచర్ అప్డేట్ కోసం డివైస్‌లో ఎంత ఖాళీ స్థలం ఉందో చూసుకోవాలి. కనీసం 1+ghz వేగవంతమైన సీపీయూ ఉండాలి. 32 బిట్కోసం 1 జీబీ మెమోరీ, 64 బిట్ కోసం 2జీబీ మెమోరీ ఉండాలి. హార్డ్ డ్రైవ్‌లో 32 బిట్ కోసం 16 జీబీ మెమోరీ, 64 బిట్ కోసం 20జీబీ స్థలం ఉండాలి. గ్రాఫిక్స్‌లో డైరెక్ట్ ఎక్స్ 9 నుంచి ఉంటే సరిపోతుంది.
ఇన్స్టాలేషన్ కోసం...
సెట్టింగ్స్‌లో అప్డేట్ అండ్ సెక్యూరిటీని క్లిక్ చేయాలి. అందులోని చెక్ఫర్ అప్డేట్లో డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక వేళ పీసీలో అప్డేట్ టూల్ పనిచేయకుంటే అప్డేట్ అసిస్టెంట్ టూల్ ఉపచయోగించి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా చేయడానికి మైక్రోసాఫ్ట్ అప్డేట్ అసిస్టెంట్ వెబ్‌పేజీని ఓపెన్ చేసుకోవాలి. 6 ఎంబీ కలిగిన అప్డేట్ టూల్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అప్డేట్ అసిస్టెంట్ ఇందుకు వీలుగా ఆప్షన్లు ఉంటాయి.ఫైన్, నెక్ట్స్ బటన్లపై క్లిక్ చేస్తుంటే డౌన్ లోడ్ ప్రారంభమవుతుంది. డౌన్లోడ్ పూర్తయ్యాక పీసీని రీస్టార్ట్ చేయాలి. మధ్య మధ్యలో పీసీ ఆటోమెటిక్‌గా రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రొసెస్ పూర్తవ్వడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. గడువు ముగిసిన సాఫ్ట్వేర్లు ఉంటే ఇది ఇన్స్టాల్ అవ్వదు. మీడియా క్రియేషన్ టూల్తోనూ అప్డేట్ చేయవచ్చు.
Authorization