ట్రూకాలర్‌ను ఇప్పటి వరకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే ఎవరికి సంబంధించిందో తెలుసుకోవడానికి, ఎవరికైనా కాల్ చేసినపుడు లిఫ్ట్ చేయకుంటే, ఆ తర్వాత వాళ్ళు మన మిస్ కాల్ చూసుకున్నారో లేదో తెలుసుకోవడానికి, ఫోన్ ఏ మోడ్‌లో ఉందో తెలుసుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఇప్పటివరకు స్పామ్ కాల్స్, కాల్ ఐడీ యాప్స్‌లో ట్రూకాలర్దే హవా. ప్రస్తుతం ఈ కంపెనీ తన సేవలను మరింత విస్తరించేందుకు చూస్తోంది. కానీ ఇకపై సిమ్‌లో బాలెన్స్ లేకున్నా, ఉచితంగా కాల్స్ చేసుకునే వెసులుబాటు రానుంది. దీని కోసం ట్రూకాలర్ ఇన్‌యాప్ వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీవోఐపీ) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల వినియోగదారులు ఉచితంగానే హై క్వాలిటీ కాల్స్ చేసుకోవచ్చు. దీనికి వైఫై లేదా మొబైల్ డేటా ఉంటే సరిపోతుంది. ప్రపంచ మార్కెట్లో వాయిస్ కాల్స్ ఫీచర్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఓవర్ ద టాప్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు టెలికాం ఆపరేటర్లు కూడా వీవోఐపీ సేవలను పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే వీవోఐపీ ఆధారిత వాయిస్ కాల్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమౌతోంది. మన దేశంలో ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.
Authorization