ఫేస్బుక్ చాటింగ్ చాలా మందికి దైనందిన జీవితంలో భాగమైపోయింది. ఇందులో మన స్నేహితులు, బంధువులు, అపరిచితులు అందరూ ఉంటారు. చాలామందికి రోజూ ఏదోకటి అప్డేట్ చేయనిదే మిగతా పనులు చేయరనిపిస్తుంది. మరికొంత మంది ఫ్రెండ్స్‌ని పెంచుకునేందుకు ఈ సోషల్ వెబ్‌సైట్‌ని వాడుతుంటారు. అయితే, ఆ లిస్ట్‌లో అందరూ మంచివారే ఉంటారని చెప్పలేం. కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. అలాంటి వారిలో ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే, వారిని వెంటనే అన్‌ఫ్రెండ్ చేసేస్తుంటాం. మరి కొందరు మనల్ని అన్‌ఫ్రెండ్ చేస్తుంటారు. ఫేస్బుక్ చాటింగ్‌లో ఇలాంటివి సర్వసాధారణం అయిపోయాయి. ఫేస్బుక్లో అన్‌ఫ్రెండ్ ఆప్షన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మరి.. మనల్ని ఎవరు అన్‌ఫ్రెండ్ చేసుంటే..? అది తెలుసుకోవాలంటే 'హూ అన్‌ఫ్రెండెడ్ మీ' అనే అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో 'హూ అన్‌ఫ్రెండెడ్ మీ' అనే యాప్‌ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఎప్పటికప్పుడు ఫ్రెండ్స్‌ని గమనిస్తూ, కొత్తగా ఫ్రెండ్ లిస్ట్‌లో ఎవరు యాడ్ అయ్యారు.. ఎవరు అన్‌ఫ్రెండ్ చేశారో నోటీస్ చేస్తుంది. అయితే.. ఈ యాప్‌ని ఇన్స్టాల్ చేయడం వల్ల ఇలాంటి లాభమున్నట్లే.. కొంత ఇబ్బంది కూడా ఉంది. అదేంటంటే.. ఫోన్ స్లో అవుతుంది. కాబట్టి మీ అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటే బాగుంటుంది.
Authorization