వాట్సాప్.. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే వారిలో ఈ యాప్ లేని వారంటూ ఉండరు. ఫొటోలు, వీడియోలు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ ఇలా అన్నింటినీ షేర్ చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తమైనది. మనకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ఎవరికీ షేర్ చేయకుండా అందరూ చూసేలా చేసేందుకు స్టేటస్‌లో అప్లోడ్ చేస్తుంటాం. వినియోగ దారులందరికీ ఇది బాగా నచ్చిన ఫీచర్. చాలా మంది రోజుకొక స్టేటస్ అయినా పెట్టనిదే పొద్దుపోదంటే ఇది ఎంతలా అలవాటైందో చెప్పకనే చెప్పవచ్చు. మనం పెట్టిన స్టేటస్లు ఇతరులు ఎలా చూస్తుంటారో, ఇతరులు కూడా పెట్టిన స్టేటస్లు మనకూ అలాగే వస్తుంటాయి. అందరూ పెట్టేవి మనకు నచ్చాలని లేదు కదా. ఈ స్టేటస్ ఫీచర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లున్నారు. స్టేటస్‌లో డాట్ సింబల్ కనిపిస్తుంటే మొత్తం స్టేటస్లు చూడకుండా ఉండలేరు. ఎవరిదైనా స్టేటస్ నచ్చకపోతే మ్యూట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినా... లిస్ట్‌లో మాత్రం వారి స్టేటస్లు కనిపిస్తుంటాయి. ఇలా నచ్చనివారి స్టేటస్లు ఇకపై చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. ఎందుకు..? అంటే.. ఇకపై ఇలాంటి స్టేటస్‌లను మనకు రాకుండా చేసేందుకు ఒక కొత్త ఫీచర్‌ను వాట్సాస్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో ఎవరి స్టేటస్ నచ్చట్లేదో వారివి లిస్ట్‌లో కనిపించకుండా చేయొచ్చు. నచ్చనివారి స్టేటస్‌ని శాశ్వతంగా హైడ్ చేసే ఫీచర్‌ని అందించబోతోంది. ఆన్లైన్ పోర్టల్ సమాచారం ప్రకారం ఇప్పటికే 2.19.183 ఆండ్రాయిడ్ బీటా వర్షన్లో ఈ హైడ్ స్టేటస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ పరీక్షించిన తర్వాత మిగతా వినియోగదారులకూ వాట్సాప్ అందించనుంది. ఈ స్టేటస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందంటే ఎవరి స్టేటస్లు నచ్చట్లేదో వారివి హైడ్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్లీ కావాలంటే 'షో' ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి, త్వరలోనే స్టేటస్‌లతో ఇబ్బందులు ఎదురవుతుంటే త్వరలోనే పరిష్కారం లభించనుంది.
Authorization