ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందించడంలో ముందుండే గూగుల్ ప్రస్తుతం మహిళల కోసం మరో ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే 'స్టే సేఫర్'. ఇది ఎందుకు సంబంధించిన ఫీచర్, ఎలా పని చేస్తుందో చూద్దాం..
ఎక్కడికైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలన్నా, తెలిసిన ప్రాంతమైనా సరే ట్రాఫిక్ ఎలా ఉంది.. ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే ఏదైనా షార్ట్ రూట్ ఉందా అనే అంశాల కోసం తప్పనిసరి ఉపయోగించే యాప్ గూగుల్ మాప్. ఇందులో మనం ప్రారంభమైన స్థానం నుంచి చేరుకోవాల్సిన గమ్యాన్ని నిర్దేశించుకుని ప్రయాణించడం సాధరణమే. ఇందులో వాయిస్ ద్వారా కూడా గమ్యాన్ని నిర్దేశిస్తుంది. కానీ ఒకోసారి వేగంగా వెళ్ళే క్రమంలో మూలమలుపు తిరగాల్సిన చోట తిరగక వెళ్తూ ఉంటే.. మీరు ఏదైనా రూట్ సెలెక్ట్ చేసుకొని వెళ్తుంటే... మ్యాప్‌లో బ్లూ డాట్ రూట్‌ని ట్రాక్ మనం ఉన్న స్థానాన్ని బట్టి గమ్యాన్ని నిర్దేశిస్తుండేది. అంతే తప్ప వెళ్ళిన రూట్ తప్పని చూపించేది కాదు. ప్రస్తుతం 'స్టే సేఫర్' పేరుతో ఈ సరికొత్త ఫీచర్ ఇండియాలో గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న అగాయిత్యాల దృష్ట్యా ముఖ్యంగా మహిళల భద్రతకు ఉపయోగపడే ఫీచర్ ఇది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకుంటే వెళ్లాల్సిన రూట్లో కాకుండా మరో దారిలో వెళ్లారంటే వెంటనే గూగుల్ మ్యాప్స్ అలర్ట్ చేస్తుంది.
ఎలా పనిచేస్తుంది..
'స్టే సేఫర్' ఫీచర్లో షేర్ లైవ్ ట్రిప్, గెట్ ఆఫ్ రూట్ అలర్ట్స్ పేరుతో రెండు ఆప్షన్స్ ఉంటాయి. షేర్ లైవ్ ట్రిప్‌లో ఎవరితో కాంటాక్ట్ కావాలో ఎంచుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వ్యక్తికి ట్రిప్ షేర్ అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నారో వాళ్లు తెలుసుకోవచ్చు. ఇక గెట్ ఆఫ్ రూట్ అలర్ట్స్ ఎంచుకుంటే మీరు మరో రూట్లో వెళ్తుంటే గూగుల్ మ్యాప్స్ నుంచి అలర్ట్స్ వస్తాయి. మీరు వెళ్లాల్సిన రూట్లో కాకుండా మరో దారిలో 0.5మీ దూరం వెళ్లగానే అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీరు ఏ రూట్లో ఉన్నారో తెలుస్తుంది. కొత్త రూట్లల్లో వెళ్లేవారికి, మహిళలకు 'స్టే సేఫర్' ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు రాంగ్ రూట్లో తీసుకెళ్లకుండా జాగ్రత్తపడొచ్చు.
Authorization