గూగుల్.. ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం ఎప్పటికప్పుడు కొత్తగా వినియోగదారులను ఆకట్టుకుంటూనే ఉంది. ఈ తరహాలోనే మరో కొత్త టూల్ అందుబాటులోకి వచ్చింది. అదే.. గూగుల్ సెర్చ్ ఆటో డిలీట్ టూల్. ఇంతకు ముందు గూగుల్‌లో ఏ సమాచారాన్ని వెదికినా, తర్వాత ఆ హిస్టరీ వద్దనుకుంటే మొత్తం క్లియర్ చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన టూల్‌తో సమాచారం దానంతట అదే డిలీట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మొబైల్ ఫోన్లలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ రెండింటిలోనూ వినియోగదారులు శోధించిన సమాచారం, లొకేషన్ హిస్టరీలకు వర్తిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ ప్లాట్‌ఫాంపై సెర్చ్ చేసే వినియోగదారుల లొకేషన్ ట్రాకింగ్, వెబ్, యాప్ యాక్టివిటీ హిస్టరీని మ్యానువల్ గా డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే.. ఆటోమాటిక్ గా డిలీట్ అవుతుంది. ఇందుకు వినియోగదారులు తమ బ్రౌజర్లో ట్రాకింగ్ ఫ్రిఫరెన్సెస్ ఎంచుకోవాల్సి ఉంటుంది. 3 నెలలు లేదా 18 నెలలు వరకు సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఎంత గడువు అనేది నిర్ణయించుకుంటే ఆ సమయానికి డిలీట్ అయిపోతుంది. వినియోగదారుల గోప్యతకు సంబంధించి ఈ మధ్య నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో ఈ విషయంపై గూగుల్, ఆపిల్ సహా ఇతర టెక్ దిగ్గజాలు సుదీర్ఘంగా చర్చించి కొత్త టూల్స్ ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. థర్డ్ పార్టీ యాప్స్‌లలో వినియోగదారులు షేర్ చేసిన సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఆటో డిలీట్ టూల్ వంటి ఫీచర్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయించాయి.
Authorization