ఇంతకు ముందు బ్యాంక్ పనులు ఏవైనా సరే.. సంబంధిత బ్రాంచ్‌కు వెళ్ళి గంటలు గంటలు క్యూలో నిలబడి చేసుకోవాల్సి వచ్చేది. ఆన్లైన్ సిస్టమ్ వినియోగం పెరుగుతున్నప్పటి నుంచి బ్యాంకుకు వెళ్ళి చేసుకోవాల్సిన పనుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని సాంకేతిక సమస్యలు, ఇంట్లో కూర్చుని చేసుకోలేని వాటికి తప్ప చాలా పనులకు బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరమే లేకుండా పోయింది. దీంతో పెరుగుతున్న టెక్నాలజీతో బ్యాంకింగ్ సేవలు సులభమయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌తోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, డెబిట్ కార్డ్, చెక్‌బుక్ రిక్వెస్ట్, స్టేట్మెంట్లు వంటివి ఒక్క యాప్‌లో సాధ్యమవుతున్నాయి. ఈ తరహాలోనే ఇపుడు ఖాతా ఉన్న శాఖను మార్చుకునే వెసులుబాటు ఎస్బీఐ అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ముందైతే నాలుగైదు ఫామ్స్ పూర్తి చేయాల్సి వచ్చేది. కొంత సమయం కూడా వేచి ఉండాల్సి వచ్చేది. ఇపుడు ఆ పరిస్థితి లేదు. ఈ సేవలు వినియోగించుకోవాలంటే చేయాల్సినది..
- ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ www.onlinesbi.com ఓపెన్ చేసి, 'పర్సనల్ బ్యాంకింగ్' పై క్లిక్ చేయాలి. నెట్ బ్యాంకింగ్ ఐడీతో లాగిన్ అవ్వాలి.
- హోమ్‌స్క్రీన్‌పై ఉన్న 'ఇ-సర్వీసెస్'ను క్లిక్ చేయాలి.
- 'ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్'లో ఏ అకౌంట్‌ను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- ఏ బ్రాంచ్‌కు మార్చుకోవాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
- దాని కింద వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను యాక్సెప్ట్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత పేజీలో ప్రస్తుత బ్రాంచ్ కోడ్, కొత్త బ్రాంచ్ కోడ్ ఎంటర్ అడుగుతుంది.
- తర్వాత అకౌంట్‌కు రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- అదీ ఎంటర్ చేసి కన్ఫర్మ్‌పై క్లిక్ చేయాలి. వారం రోజుల్లో అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాకపోతే బ్యాంకుకు వెళ్ళి గంటలు గంటలు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. వీటన్నింటికంటే ముందు అకౌంట్ మార్చుకోవాలంటే ప్రస్తుత బ్యాంక్‌లో కేవైసీ పూర్తి చేసి ఉండాలి.
Authorization