ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వినియోగదారులకు అందించడంలో వాట్సాప్ ముందంజలో ఉంటుంది. నిన్న మొన్నటి వరకు డార్క్‌మోడ్, స్టేటస్ హైడ్ అంటూ ఫీచర్లను తీసుకువచ్చింది. మళ్లీ మరి కొన్ని కొత్త ఫీచర్లను అందించేందుకు ప్రయోగాలు చేస్తోంది. ఎప్పటికప్పుడు వాట్సాప్‌ను తీసేస్తున్నారంటూ, కొంత సమయం బ్లాక్ అవుతోందంటూ అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి వార్తలను పక్కకు నెడుతూ వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు బీటా వర్షెన్‌లో ప్రయోగాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే మరి కొన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి..
మల్టీ చాట్
ఈ ఫీచర్ ద్వారా ఒకే ప్లాట్‌ఫాం నుంచి వివిధ ప్లాట్ ఫాంలపై చాటింగ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, జీ-మెయిల్, గూగుల్ ఫొటోలు ప్లాట్‌ఫాంలపై స్టోరీల స్టేటస్ పోస్టులను షేర్ చేసుకోవచ్చు. API టెక్నాలజీ సాయంతో సోషల్ అకౌంట్లతో లింక్ లేకుండానే నేరుగా స్టోరీలను షేర్ చేసుకోవచ్చు. అంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌ల్లోని డేటా షేరింగ్ ద్వారా వాట్సాప్‌లోని స్టేటస్ పోస్టును మరో ప్లాట్ ఫాంలోకి షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇతర ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు డేటాను షేర్ చేస్తే.. ఆ పోస్టు ఫేస్బుక్ సిస్టమ్స్‌లో రెండు పోస్టులుగా కనిపిస్తుంది. ఈ మల్టీ చాట్ ఫీచర్.. ఆండ్రాయిడ్ బేస్డ్ వాట్సాప్‌లో తొలిసారి బీటా వెర్షన్ 2.19.151 గా కనిపించింది. ప్రస్తుతానికి ఈ వెర్షన్ ప్రయోగదశలోనే ఉంది.
ఫొటో షేర్ చేసేందుకు..
వాట్సాప్ వినియోగిస్తున్న వారందరూ రోజూ ఏదో ఒక ఫొటోను షేర్ చేస్తూనే ఉంటారు. అయితే అప్పుడప్పుడూ ఎదురయ్యే అనుభవం ఫొటో ఒకరికి బదులు మరొకరికి పంపించడం.. అలా తొందరలో వేరే వాళ్ళకు పంపినపుడు ఆ ఫొటో డిలీట్ కొట్టడమో, వాళ్ళకి క్షమాపణ చెప్పడమో జరుగుతుంటుంది. కానీ ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఫీచర్.. ఆ సమస్య తలెత్తకుండా చేస్తుంది. అంటే, ఫొటో ఎవరికైతే పంపాలో వారికే చేరేలా కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. కొత్త వాట్సాప్ బీటా అప్డేట్ ద్వారా వినియోగదారులు ఫొటో ఎవరికి పంపుతున్నారో ఒకటికి రెండుసార్లు పరిశీలించుకుని పంపించుకోవచ్చు. అయితే వాట్సాప్ బీటా వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లో 2.19.173 వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వాట్సాప్ స్టేబుల్ వెర్షన్ వినియోగదారులైతే.. ఇమేజ్ ఎవరికైనా పంపించే సమయంలో టాప్ లెఫ్ట్ కార్నర్లో ప్రొఫైల్ ఫొటోతో పాటు ఓ చిన్న ఐకాన్ కనిపిస్తుంది. దాని ద్వారా షేర్ చేసే ఫొటో ఎవరికి వెళ్తుందో చూడవచ్చు. లేదంటే క్యాప్షన్ ఏరియా దిగువ భాగంలో ఎవరికి పంపిస్తున్నామో వారి పేరు కనిపిస్తుంది. ఈ ఫీచర్.. ఇమేజ్ షేరింగ్, వ్యక్తిగత చాట్స్, గ్రూపు చాట్స్ లో అందుబాటులో ఉంది. గ్రూపులో కూడా ఇమేజ్ షేర్ చేసినప్పుడు డబుల్ చెక్ చేసుకోనే అవకాశం ఉంది. కొత్త వాట్సాప్ ఫీచర్‌ను త్వరలో స్టేబుల్ ఆండ్రాయిడ్ వెర్షన్ యాప్‌లోనూ అందుబాటులోకి తీసుకురానుంది.
సొంత స్టిక్కర్ల ప్యాక్
వాట్సాప్ కొత్తగా అప్డేటెడ్ స్టిక్కర్లతో పాటు బ్రాండ్ న్యూ స్టిక్కర్ ప్యాక్‌ను 'ఓపీఐ' పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాక్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ బేస్డ్ ఫోన్లలో యాక్సెస్ చేసుకోవాలన్నా, డౌన్లోడ్ చేసుకున్నా కొన్ని స్టెప్స్ అమలు చేస్తే సులువుగా స్టిక్కర్ ప్యాక్‌ను పొందవచ్చు. కొత్త స్టిక్కర్ ప్యాక్ క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం థర్డ్ పార్టీ యాప్ అయిన 'స్టిక్కర్ మేకర్ ఫర్ వాట్సాప్' యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు వాట్సాప్ అకౌంట్లో సొంత స్టిక్కర్ ప్యాక్‌ను క్రియేట్ చేసుకోవాలంటే వాట్సాప్ అకౌంట్ నుంచి వ్యక్తిగత లేదా గ్రూపు చాట్ విండో ఓపెన్ చేయాలి. ఇందులో కనిపించే GIF, Stickers మెనూపై ట్యాప్ చేయాలి. ఈ మెనూలో 'ప్లస్' గుర్తు ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అన్ని రకాల స్టిక్కర్లు కనిపిస్తాయి. పై భాగంలో కొత్త Opi స్టిక్కర్ ప్యాక్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి కస్టమైజడ్ స్టిక్కర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సొంత స్టిక్కర్ తయారు చేయాలనుకుంటే మాత్రం 'స్టిక్కర్ మేకర్ యాప్' ఓపెన్ చేసి, క్రియేట్ న్యూ స్టిక్కర్ ప్యాక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో యాడ్ స్టిక్కర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి, క్రియేట్ న్యూ స్టిక్కర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అవసరమైన ఇమేజ్ను ఫోన్ గ్యాలరీ లేదా గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోల ద్వారా ఎంచుకుని స్టిక్కర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎంచుకున్న ఇమేజ్ను క్రాప్ చేసుకోవచ్చు. వాట్సాప్ అకౌంట్లోని ఇతర స్టిక్కర్లతో పాటు తయారు చేసిన స్టిక్కర్లు కూడా ఆటోమాటిక్‌గా కనిపిస్తాయి. ఒకవేళ నచ్చకున్నా డిలీట్ చేసుకునే వెసులుబాటు ఉంది.
Authorization