మార్కెట్లోకి కొత్త కొత్త ఫీచర్లతో ఫోన్లు వస్తున్నాయి. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ఆసక్తి ఉంటుంది. కొందరు కేవలం తెలుసుకుంటుంటారు. మరికొందరు కొత్త ఫోన్ రాగానే కొనేస్తుంటారు. నెలల తేడాతోనే ఫోన్లు మారుస్తుంటారు. మరికొందరు అవసరాన్ని బట్టి ఫోన్లు మారుస్తుంటారు. ఇలాంటి సమయాలలో ఎదుర్కొనే సమస్య కాంటాక్టులు.. పాత ఫోన్లో ఉన్న అన్ని నెంబర్లను కొత్త ఫోన్లో సేవ్ చేయాలంటే చిన్న పనేం కాదు. కనీసం గంట పడుతుంది. ఎక్కువ కాంటాక్టులు ఉన్న వారికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మరి దానిని అధిగమించాలంటే ఏం చేయాలి. ప్రస్తుతం అందరూ చేస్తున్నది గుగూల్ అకౌంట్‌కు కాంటాక్టు నెంబర్లు కాపీ చేసి, దాని ద్వారా కావాల్సిన ఫోన్‌కు కాపీ చేసుకోవడం. ఒక వేళ అలా అవ్వకపోతే..? కాంటాక్టు నెంబర్లు పోగోట్టుకోలేం కదా.. మరి ఈ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలో చూద్దాం..
ఒక ఫోన్లోని కాంటాక్ట్స్ జాబితా మరో ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఆ ఫోన్లు సపోర్ట్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. కాంటాక్ట్స్ జాబితాను ఒక ఫోన్ నుంచి మరొక ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఇది మనం కాంటాక్టు నెంబర్లు సేవ్ చేసుకునే విధానంపై ఆధారపడి ఉంటుంది.
సిమ్ ద్వారా..
దీని ద్వారా తక్కువ నెంబర్లు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకునే వీలుంటుంది. ఇందుకు పాత ఫోన్లో మెమోరీలోని నెంబర్లను సిమ్కార్డ్లోకి కాపీ చేసుకోవాలి. తర్వాత దానిని కొత్త ఫోన్లో వేసి, మూవ్ టు ఫోన్ మెమోరీ అంటే అన్ని ఫోన్ మెమోరీకి కాపీ అయిపోతాయి. ప్రస్తుతం ఈ పద్ధతిని అవలంభించాల్సిన అవసరం అంతగా ఉండడం లేదు.
ఎస్డీ కార్డు ద్వారా..
పాత ఆండ్రాయిడ్ ఫోన్లో మైక్రోఎస్డీ కార్డ్‌కు కాంటాక్టులను కాపీ చేయాలి. ఇందుకు కాంటాక్ట్స్‌లోకి వెళ్ళి మెనూలో కనిపించే ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్‌ను ఎంచుకోవాలి. అందులో ఎక్స్పోర్ట్ టు ఎస్డీ కార్డ్ మీద క్లిక్ చేస్తే అన్ని అందులోకి ఒక ఫోల్డర్ రూపంలో కాపీ అవుతాయి. ఈ ఎస్‌డీకార్డును కొత్త ఫోన్లో అమర్చి, కాంటాక్ట్సు ఫోల్డర్‌ను పేస్ట్ చేసుకుంటే సరి.
జీ మెయిల్ ద్వారా..
ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగానికి జీమెయిల్ తప్పనిసరి. మన నెంబర్లు ఏవైనా సరే సేవ్ చేసుకునేపుడే జీ-మెయిల్ ఫోన్ మెమోరీ అని ఆప్షన్ అడుగుతుంది. ఫోన్ మెమోరీకి బదులు జీ-మెయిల్ ఆప్షన్ ఎంచుకుంటే, నెంబర్లు ఎక్కడకు కాపీ చేసుకోవాల్సిన పని లేదు. కానీ కొత్త ఫోన్‌ను ఉపయోగించేపుడు మాత్రం పాత ఫోన్లో ఏ జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ ఆయ్యామో, అదే అకౌంట్‌ను ఉపయోగిస్తే నెంబర్లు మొత్తం వచ్చి చేరతాయి.
Authorization