గూగుల్ మాప్స్ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. మనందరికీ తెలిసిన విషయం.. ఎక్కడికైనా వెళ్ళాలంటే, మనం ఉన్న ప్రదేశం నుంచి వెళ్ళాలనుకున్న ప్రదేశాన్ని నిర్ణయించుకుంటే.. అక్కడికి సులువుగా వెళ్లొచ్చు. ఇందులో ఏది సులువైనా దారి.. ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది.. అనేది ఆయా రంగులతో చూపిస్తూ ఉంటుంది. ఈ మధ్యనే రూట్ మారితే వెంటనే ఎలర్ట్ చేసే ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం.. గూగుల్ మాప్స్ ఉపయోగించే వారికి రెస్టారెంట్లలో డిస్కౌంట్లు ప్రకటిస్తోంది.
సాధారణంగా మనకు దగ్గర్లో రెస్టారెంట్లు ఎక్కడ ఉన్నాయో గూగుల్ మ్యాప్స్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. ఇక నుంచి ఆ రెస్టారెంట్లలో డిస్కౌంట్లు కూడా గూగుల్ మాప్స్ ద్వారా పొందవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా ఫీచర్లు వచ్చాయి. అందులో రెస్టారెంట్స్‌లో డీల్స్ గురించి తెలిపే ఫీచర్ కూడా ఒకటి. ఇందులో వెళ్ళాలనుకున్న రెస్టారెంట్లల్లో ఎంత వరకు డిస్కౌంట్ పొందవచ్చో వివరిస్తుంది. ఇందుకోసం ఈజీడైనర్ ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, పూణె, కోల్‌కతా, గోవా, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్ పట్టణాల్లో గల రెస్టారెంట్లల్లో 25 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. లాంఛింగ్ ఆఫర్లో భాగంగా యూజర్లు ఈజీడైనర్ ప్రైమ్ ఆఫర్లను 15 రోజుల పాటు ఉచితంగా పొందొచ్చు. అందించే ఆఫర్లు అభిరుచులకు తగినట్టుగానే ఉంటాయని సంస్థ వెల్లడించింది.
డిస్కౌంట్ పొందే విధానం..
స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే రెస్టారెంట్స్, కాఫీ, హోటల్స్, పార్క్స్, పెట్రోల్ లాంటి షార్ట్‌కర్ట్స్ కనిపిస్తాయి. అందులోనే ఆఫర్స్ పేరుతో షార్ట్ కట్ ఉంటుంది. దీని పైన క్లిక్ చేస్తే మీకు దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ల వివరాలు కనిపిస్తాయి. ఏయే రెస్టారెంట్లో ఎంత శాతం వరకు డిస్కౌంట్ పొందే వీలుందో డీల్ కనిపిస్తుంది. ఇందుకోసం రెస్టారెంట్ వెబ్‌సైట్‌కి వెళ్లాల్సిన అవసరమే లేదు. నేరుగా గూగుల్ మ్యాప్స్ నుంచే టేబుల్ బుక్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్ 25 శాతం వరకు ఉంటుంది. దీంతో పాటు గూగుల్ 'ఫర్ యూ' పేరుతో మరో ట్యాబ్ యాడ్ చేసింది. ఇందులో మీ అభిరుచులకు తగ్గట్టుగా మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రదేశాలు, రెస్టారెంట్లు, దగ్గర్లో చూడదగ్గ ప్రదేశాలను సైతం అందిస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది.
Authorization