విదేశాలలో ఈ ఏడాది ప్రారంభమంలో ప్రారంభమైన లెనోవో టాబ్ వీ 7.. మన దేశంలోనూ రిలీజైంది. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో రిటైలర్ల ద్వారా మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు అదిరిపోయేలా ఉన్నాయని మార్కెట్ వర్గాల సమాచారం. ఇది వ్యాపారులతో పాటు విద్యార్థులు, నిపుణులకు అనువుగా ఫీచర్లు ఉన్నట్టు సమాచారం. ఇందులో ఐరిస్ గుర్తింపు సాంకేతికతతో పాటు కొన్ని ప్రత్యేక వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.ఇన్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజరు సేల్స్ సహా ఇతర రిటైల్ అవుట్లెట్ల ద్వారా త్వరలో ఈ టాబ్లెట్ అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందులోని ఫీచర్లు, ధర తదితర అంశాలను చూసుకుంటే..
సన్నగా ఉన్న ఈ టాబ్ 6.9-అంగుళాల ఎల్సిడి స్క్రీన్ కలిగి ఉండనుంది. 1080 x 2160 పిక్సెల్‌ల రిజల్యూషన్, 350 నిట్ల గరిష్ట బ్రైట్నెస్ను కలిగి ఉండనుంది. ఈ స్క్రీన్ డివైస్ ముందు భాగంలో సుమారు 81 శాతం కవర్ చేస్తుంది. డెల్బీ ఆడియో ట్యూనింగ్‌తో వచ్చే రెండు ఫ్రంట్-ఫైరింగ్ స్పీకర్లను అందించడానికి మిగిలిన స్థలాన్ని కేటాయించారు. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందిస్తోంది. చూడడానికి స్మార్ట్‌ఫోన్‌లా ఉన్నా, స్మార్ట్‌ఫోన్ కంటే కాస్త పెద్దది. దీనిని సులభంగా ఒకే చేతి పట్టుతో వాడవచ్చు. లెనోవో టాబ్ వీ7 రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందించబడుతోంది.
3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్లతో రెండు ఫోన్లు బ్లాక్ కలర్లో అందుబాటులో ఉండనున్నాయి. వీటి ధరలు వరుసగా రూ.12,990, రూ.14,990. ఈ రెండింటిలోనూ అదనంగా 128 జీబీ మెమోరీ కార్డు ఉపయోగించే వెసులుబాటు ఉంది. ఈ ఇది 9.0పై సాఫ్ట్వేర్ కలిగి ఉంది. రెండు కెమెరా యూనిట్లు ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీ కోసం 5ఎంపీ ఫిక్స్డ్ ఫోకస్ సెల్ఫీ షూటర్, వెనుక భాగంలో 13 ఎంపీ ఆటో ఫోకస్ కెమెరా ఉంది. కెమెరా యాప్ హెచ్డీఆర్, పనోరమా, నైట్ షాట్, పోర్ట్రెయిట్‌తో పాటు మరిన్ని వివిధ ఇమేజింగ్ మోడ్ల్స్ను అందిస్తుంది. ఇందులో డ్యూయెల్ సిమ్‌కార్డులకు అవకాశం ఉంది. వైఫై, బ్లూటూత్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ లభిస్తాయి. ఇందులో 5180 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని వల్ల 30 గంటల వాయిస్ కాల్స్, 10 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ మరియు బ్రౌజింగ్ అందిస్తుంది. ఇందులో యూఎస్బీ టైప్ - సి పోర్ట్ ఉంది.
Authorization