ప్రశ్న : చంద్రయాన్-2 ప్రయోగాన్ని సరిగ్గా 2.53 సమయానికే ఎందుకు నిర్ణయించారు? 2.50 లేదా 2.30 లేదా 3.00 గంటలకు ఎందుకు చేయలేదు? 0.53 కున్న విశిష్టత ఏమిటి?
- ఎం. సాత్విక్, వరంగల్
జవాబు: 2.53 గంటలకు (సోమవారం) పంచాంగం ప్రకారం నిర్ణయించబడింది. ఆ సమయానికి అనుగుణంగానే మిగతా కార్యకలాపాల సమయాలు నిర్థారించబడతాయి. ఉదాహరణకు వరంగల్ నుంచి హైదరాబాద్కు 2 గంటల 30 నిమిషాలు పడితే ఇక్కడ వరంగల్లో అర్ధరాత్రి బయల్దేరితే మరుసటి రోజు తెల్లవారు ఝామున 2.30 amకు హైదరాబాద్ చేరుకుంటాము. అలా కాకుండా ఉదయం 6 గంటలకు బయల్దేరితే ఉదయం 8.30 am కు హైదరాబాదు చేరుకుంటాము. ఉదయం 9.53 amకు బయల్దేరితే మధ్యాహ్నం 12.23 pm కు చేరుకుంటాము. అయితే అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం వివిధ దేశాల రాకెట్టు ప్రయోగాల సమయానికి కొంత వ్యవధులు (time wintour or time stats) ఉంటాయి. కాబట్టి చంద్రయాన్-2 ను 2.50కి పంపినా 3.00pm కు పంపినా మిగిలిన అంతరిక్ష సంఘటనలు కూడా తదనుగుణంగా ఉంటాయి. కానీ ఓ వైపు అద్భుతమైన శాస్త్ర సాంకేతిక ప్రయోగాన్ని విజయవంతంగా సఫలీతకతం చేస్తున్న ఇస్రో (ISRO) అధికార గణమే, పాలకుల ఒత్తిడికి లొంగడం వల్లనో మరో కారణం వల్లనో అశాస్త్రీయపు పంచాంగం ప్రకారం రాకెట్టు ప్రయోగం చేశారు. పెళ్లి ముహూర్తంలాగా ముహూర్తాన్ని బట్టి ప్రయోగించారు. ఇది పూర్తిగా అశాస్త్రీయం.
మూఢనమ్మకం. రాహుకాలం, వర్జ్యం అంటూ నమ్మకాలను బలపర్చినట్లయింది. ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుడిపై సునాయాస పాద తాడనం (Soft Landing) ద్వారా ఓ శకటాన్ని పంపగల సామర్థ్యం పొందిన నాల్గవ దేశంగా భారతదేశానికి వన్నె, కీర్తి తెచ్చిన ISRO వారి శాస్త్ర సాంకేతిక నైపుణ్యత మాటున వారి అధికారుల చేష్టల్లో ఉన్న ఛాందస ధోరణి కూడా బయటికి ప్రయోగించబడింది. శాస్త్ర విజ్ఞాన ప్రకారం ముహూర్తాలకు అర్థం పర్థం లేదు.
- ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక
email: allikayala@gmail.com
Authorization