వేలు ఖర్చు చేసి కొన్న ఫోన్ సంవత్సరం కూడా వేగంగా పనిచేయకపోతే ఎలా ఉంటుంది. కొన్ని సార్లు హ్యాంగ్ అవుతుంది. మళ్ళీ ఫోన్ రీస్టార్ట్ చేస్తేనే పని చేస్తుంది. ఇది అందరూ ఎదుర్కొనే సమస్యనే.. అసలు ఫోన్ ఎందుకు హ్యాంగ్ అవుతుంది..? ప్రస్తుతం అయితే ఫోన్ మెమోరీలు దాదాపు 256జీబీ వరకు వెళ్తున్నాయి. అయినా సరే ఒక్కడో ఒక చోట స్ట్రక్ అవుతూనే ఉంటాయి. అపుడు ఏం చేయాలి.. అందుకు ఏమేమి కారణం అవుతాయి.. ఫోన్‌ను ఎంత జాగ్రత్తగా విని యోగించాలో తెలుసుకుందాం..
మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆలోచనా విధానం మారు తోంది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లను బాగానే ఉపయోగిస్తున్నారు. కొత్త కొత్త ఫీచర్లతో టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందుకు అనుగుణంగా ప్లేస్టోర్‌లో రకరకాల యాప్‌లు అందుబాటులో ఉంటున్నాయి. డెస్క్‌టాప్, ల్యాప్‌ట్యాప్‌లలో హార్డ్‌డిస్క్ మెమోరీ వాడకం పెరిగే కొద్ది, వాటి పని తీరు నెమ్మదిస్తున్నట్టే సార్ట్ఫోన్లోనూ ఉంటుంది. వివిధ రకాల యాప్స్, గేమ్స్‌కు సంబంధించి ఎవరి అభిరుచులకు తగినట్టు ఇన్స్టాల్ చేసుకోవడం సర్వసాధారణమే.. బ్యాంక్ యాప్స్, యూటీఐ బేస్డ్ యాప్స్, గేమ్స్, రైల్వే, స్కానింగ్, షాపింగ్, ఫొటో వీడియో ఎడిటింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. అంతమే ఉండదు.. ఇందులో కొన్ని మాత్రమే రోజువారీ ఉపయోగించేవి. మిగిలినవి కాలక్షేపం కోసం ఎప్పుడో ఒక సారి మాత్రమే ఉపయోగిస్తాం. సాధారణంగా యాప్స్ పెరిగే కొద్ది ఫోన్‌కు భారం పెరుగుతున్నట్టే.. ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి కాబట్టి ఫోన్‌కు భారం పెరుగుతుంది. ప్రాసెసర్‌పై పడే ఈ భారం వల్లే ఫోన్ నెమ్మదిస్తుంది. స్ట్రక్ అవుతుంటుంది. అవసరం లేని యాప్‌లను అన్ఇన్స్టాల్ చేసుకుంటేనే ఉత్తమం.
పెరుగుతున్న ఫోన్ మెమోరీ..
ప్రస్తుతం మార్కెట్లోకి అందుబాటులో ఉరటున్న ఫోన్లన్నీ 32జీబీ 128 జీబీ వరకు ఉంటున్నాయి. అంతకంటే ఎక్కువ ఇంటర్నల్ మెమోరీ ఉండే ఫోన్లు సైతం అందుబాటులో ఉంటున్నారు. ర్యామ్‌ల సైజు ఏం తక్కువ కాదు.. 512 ఎంబీ నుంచి 6 జీబీ వరకు పెరిగాయి. ఇలా మెమోరీ సైజు పెరుగుతూ ఉండే కొద్ది అందులో చేరే ఫైల్స్ సంఖ్య కూడా అదే తీరులో ఉంటోంది. ఫైల్స్ లోడ్ ఎక్కువ అవ్వడం కూడా ఫోన్ స్ట్రక్ అవ్వడానికి ఒక కారణం.
అనవసరమైన యాప్స్
ఫోన్ ఉంది కదా అని ఏది అవసరం అనిపిస్తే అది ఇన్స్టాల్ చేసేయడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. వీటితో పాటు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇంతకు ముందు ఫేస్బుక్, ట్విట్టర్ వంటివి సిస్టమ్స్, ల్యాప్‌ట్యాప్‌లలో ఎక్కువగా వినియోగించేవారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో వాటికోసం స్పేస్ తప్పనిసరి.. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి తస్పనిసరి ఉపయోగిస్తున్నారు. అవసరాన్ని బట్టి ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం వల్ల ఇంటర్నల్ మెమోరీనే కాదు, ర్యామ్పైనా భారం పడుతుంటుంది.అందువల్ల ర్యామ్ వాడకాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. అన్ని యాప్స్‌కు ర్యామ్ అవసరం ఉంటుంది. ఎక్కువగా ఒకేసారి రకరకాల యాప్స్‌ను ఉపయోగిస్తుంటే ర్యామ్ వేగం మందగిస్తుంది. ఫోన్ స్లో అవుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు క్లీనింగ్‌కు సంబంధించి, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్‌ను గుర్తించి క్లీన్ చేసుకోవాలి. ఇందుకు క్లీన్‌మాస్టర్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు బ్రౌజర్ హిస్టరీతో పాటు క్యాచ్డ్ డేటాను సైతం క్లీన్ చేసి, ర్యామ్‌ను ఖాళీగా ఉంచుతుంది. ఫోన్లో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్నింగ్ ఉండే యాప్స్ వల్ల ఫోన్ వేడెక్కుతుంటుంది. ఇది ఫోన్‌పై ప్రభావం పడుతుంది. ఈ సమస్యను కూడా ఇందులోని కూల్‌డౌన్ యువర్ ఫోన్ ఆప్షన్ ద్వారా తొలగించుకోవచ్చు. ఉపయోగించని డేటాను ఎప్పటికప్పుడు తొలగించుకుంటుంటే స్టోరేజీ స్పేస్ మిగులుతుంది. దీని వల్ల ఫోన్ స్లో అవ్వకుండా కాపాడుకోవచ్చు.
ఎస్డీలకు దూరంగా..
మార్కెట్లో అనేక రకాల ఎస్డీ కార్డులు ఎక్కువ జీబీ ఉన్నవే అందుబాటులో ఉంటున్నాయి. కానీ వాటికి కాస్త దూరంగా ఉండడమే ఉత్తమం. మెమోరీ కార్డుతో ఎక్కువ స్పేస్ లభించినా వీటి వల్ల వైరస్ సోకి, ఫోన్ స్ట్రక్ అయ్యే ప్రమాదం ఉంది. ఫోన్ వేగం తగ్గుతుంది. ప్రస్తుతం ఉపయోగించే ఫోన్లు ఎలాగో ఎక్కువ జీబీ ఉంటున్నవే ఉంటున్నాయి కాబట్టి, ఎస్డీ కార్డులకు దూరంగా ఉంటే మేలు.
రక్షణ అవసరం
ల్యాప్‌టాప్, డెస్క్టాప్లలోనే కాదు మొబైళ్ళలోనూ సెక్యూరిటీ పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. మనం ఉపయోగించే డివైస్‌లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ లేదా ఇతర వ్యక్తిగత యాప్‌లు ఉపయోగించిన తర్వాత వాటి నుంచి సైన్అవుట్ అవ్వకుండా వదిలేస్తుంటాం. ఇలాంటి వాటికి సెక్యూరిటీ మాల్వేర్ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. మొట్టమొదట మనం ఎంచుకునేది స్క్రీన్ లాక్. ఇది ప్రాథమిక రక్షణగా ఉంటుంది. ఇంటర్నల్‌గా ఏర్పడే సెక్యూరిటీ సమస్యల నుంచి రక్షించుకునేందుకు గూగుల్ ఆండ్రా యిడ్ డివైజ్ మేనేజ్మెంట్ను ఇన్స్టాల్ చేసుకుంటే సరి. మన సమా చారాన్ని ఇతరులు యాక్సెస్ చేయలేరు. ఒక వేళ మనం ఓపెన్ చేయా లన్నా.. పిన్ లేదా పాస్వర్డ్ ఆధారంగానే ఓపెన్ చేయగలుగుతాం. కాబట్టి సెక్యూరిటీ సమస్య తలెత్తే అవకాశం ఉండదు.
ఇలా ఎప్పటికప్పుడు ఫోన్ వినియో గంలో జాగ్రత్తలు పాటిస్తే, వేగం తగ్గకుండా ఉంటుంది. ఫోన్ నాలుగు కాలాల పాటు మన్నుతుంది.
అప్డేట్ తప్పనిసరి
స్మార్ట్‌ఫోన్ మరింత వేగంగా పనిచేయాలంటే అప్లికేషన్స్‌ను అప్డేట్గా ఉంచుకోవాలి. వీటి వల్ల ఫోన్ వేగం మందగించకుండా ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకునే కొన్ని యాప్స్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇది ఫోన్ ప్రాసెసర్‌పై ప్రభావం చూపుతుంది. యాంటి స్పైవేర్, యాంటీ మాల్వేర్ వంటివి వైరస్ నుంచి ఫోన్‌ను కాపాడుతాయి. అంతేకాకుండా అప్డేట్స్ను ఆటో మేటిక్‌గా కాకుండా మాన్యువల్‌గా అవసరాన్ని బట్టి చేసుకునేలా ఆప్షన్ పెట్టుకుంటే మంచిది. వీటితో పాటు అవసరమైన అప్లికేషన్స్ మాత్రమే ఫోన్లో ఉంచి, మిగిలినవి తీసేస్తే వేగంగా పనిచేసే అవకాశం ఉంది.
Authorization