దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ నుంచి 'గెలాక్సీ' సిరీస్లో మరో రెండు లగ్జరీ స్మార్ట్ఫోన్లు దేశీ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అవి 'గెలాక్సీ నోట్ 10', 'గెలాక్సీ నోట్ 10 ప్లస్'. ఈ ఫోన్లను ఆగస్టు 20న బెంగళూరులోని శాంసంగ్ ఓపెరా హౌస్లో జరిగిన ఈవెంట్లో ఆవిష్కరించారు. ఆగస్టు 23 నుంచి ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, టాటా క్లిక్ ఆన్లైన్ దుకాణాలతో పాటు అన్ని రిటైల్ స్టోర్లలోనూ ఈ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి ఉన్నాయి. ఈ ఫోన్లు ఆరా గ్లో, ఆరా వైట్, ఆరా బ్లాక్ రంగుల్లో లభ్యమవుతున్నాయి. 'గెలాక్సీ నోట్ 10'కు సంబంధించిన 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. దీని ధరను రూ.69,999గా ఉంది. 'గెలాక్సీ నోట్ 10+'లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. దీని ధర రూ.79,999గా ఉంది. 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.89,999 గా ఉంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్ ద్వారా ఫోన్లను కొనుగోళ్లు చేసిన వారికి రూ.6000 క్యాష్ బ్యాక్ అందిస్తున్నారు.
గెలాక్సీ నోట్ 10 ఫీచర్లు.. 6.3 అంగుళాల డిస్ప్లే, 1080 X 2280 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, శాంసంగ్ ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టమ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 12+16+12 బ్యాక్ కెమెరా, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.
గెలాక్సీ నోట్ 10+ ఫీచర్లు.. 6.8 అంగుళాల డిస్ప్లే, 1440 X 3040 స్క్రీన్ రిజల్యూషన్, శాంసంగ్ ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టమ్, 12 జీబీ ర్యామ్, 256/ 512 జీబీ స్టోరేజీ, 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 12+16+12+0.3 బ్యాక్ కెమెరా, 4300 ఎంఏహెచ్ బ్యాటరీ.
Authorization