గూగుల్ తన తదుపరి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10ను ఈ మధ్యనే ప్రకటించింది. ఈ జనరేషన్‌ను 10 ను ప్రకటించినప్పటి నుంచి ప్రతి స్మార్ట్ ఫోన్ కంపెనీ, తమ ఫోన్లలో ఆండ్రాయిడ్10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే నోకియా ఫోన్లలో ఆండ్రాయిడ్ 10 అందివ్వనున్నట్టు ప్రకటించారు. గూగుల్ పిక్సెల్ కూడా రాబోయే తన పిక్సెల్ స్మార్ట్ఫోన్లతో పాటు గూగుల్ పిక్సెల్ 4 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయనుంది. అయితే ప్రస్తుత నివేదిక ప్రకారం ఆండ్రాయిడ్10ను తన పాత పిక్సెల్ స్మార్ట్ఫోన్లలో ఉహించిన దాని కంటే త్వరగా విడుదల కావచ్చని సూచించింది. సెప్టెంబర్ 3, 2019న పిక్సెల్ స్మార్ట్ఫోన్లకు ఆండ్రాయిడ్ 10ను విడుదల చేసే అవకాశం ఉంది అని ఫోన్ తయారీ కంపెనీ అరేనా ఒక నివేదికలో తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 10 అప్డేట్ సెప్టెంబర్ 3 నుంచి అందుబాటులోకి రానున్నది. ఆండ్రాయిడ్ 10 అప్డేట్ను పొందే పిక్సెల్ స్మార్ట్ఫోన్లు పిక్సెల్ 3ఎ, పిక్సెల్ 3 ఎ ఎక్స్ఎల్, పిక్సెల్ 3, పిక్సెల్ 3ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా పిక్సెల్ 2, పిక్సెల్ 2ఎక్స్ఎల్, స్మార్ట్ఫోన్లలోనూ లభిస్తుంది. అయితే గూగుల్ సంస్థ విడుదల చేసే అప్డేట్ 10 తేదీని ఇంకా ధ్రువీకరించలేదు. ఒక శాంసంగ్ తన గెలాక్సీ ఎ-సిరీస్‌ను పునరుద్ధరించింది. దీనితో పాటు గెలాక్సీ ఎ 10, గెలాక్సీ ఎ 30, గెలాక్సీ ఎ 50లతో సహా మొత్తం ఎ సీరిస్‌లలో అప్డేట్ వర్షెన్‌ను అందిస్తోంది. తర్వాత రానున్న ఫోన్లలోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. అయితే శాంసంగ్ 2020లో విడుదల చేసే గెలాక్సీ ఎ71, ఎ 91లలో నేరుగా ఈ అప్డేట్ వర్షెన్ రానున్నట్టు ముందే ప్రకటించేసింది.
Authorization