వాట్సాప్ చాటింగ్ అందరికీ అలవాటే. ఇందులో పంపిన మెసేజ్‌కు ఒక టిక్ వస్తే సెండ్ అయినట్టు, రెండు టిక్‌లు వస్తే అవతలి వారికి రీచ్ అయినట్టు, ఆ రెండు టిక్స్ బ్లూ కలర్లోకి మారితే మెసేజ్‌ను అవతలి వారు చదివినట్టు అని తెలిసిన విషయమే. అయితే వచ్చిన మెసేజ్‌లు మనం చదివినా సరే అవతలి వారికి తెలియకుండా ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? కొన్ని సందర్భాలలో మెసేజ్‌లు చూసామన్న విషయం అవతలి వారికి తెలియకుండా ఉంటే బాగుండు అని కోరుకోకునే వారు ఉంటారు. అలాంటి అవకాశమే ఇప్పుడు వచ్చింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు వర్తిస్తుంది. దీనిని ఉపయోగించాలంటే ఏం చేయాలో చూద్దాం..
స్మార్ట్ఫోన్లలో నోటిఫికేషన్లు సర్వసాధారణం. ఈ ఆప్షన్ అందరికీ ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ వచ్చాక, పాస్‌కోడ్, ఫేస్ఐడి లేదా పాట్రన్ లాక్‌ని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేస్తాం కదా.. ఫోన్ అన్‌లాక్ అవ్వగానే నోటిఫికేషన్లో ఉన్న మెసేజ్‌పై లాంగ్‌ప్రెస్ చేయాలి. ఆ మెసేజ్ వాట్సాప్‌లో కాకుండా నోటిఫికేషన్లోనే పెద్ద ఫాంట్‌తో అక్కడే ఓపెన్ అయిపోతుంది. అలా అందులో ఉన్న సారాంశం చదివేయవచ్చు. ఈ ఫీచర్ ఉపయోగ పడాలంటే నోటిఫికేషన్‌ను స్వైప్ చేయకుండా ఉండాలి. అలా చేస్తే మెసేజ్ నోటిఫికేషన్లో కనిపించదు. అవతలి వారికి నీలిరంగు టిక్‌లు కనిపిస్తాయి. ఈ ఫీచర్ స్మార్ట్‌ఫోన్ రన్నింగ్ ఆండ్రాయిడ్ వెర్షన్లలో 9.0 పైన, ఐఫోన్ 13లో నడుస్తున్న ఐఫోన్లలో అందుబాటులో ఉంది.
Authorization