ఈ రోజుల్లో చేతిలో ఫోన్ లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఏ చిన్న పనికైనా ఫోన్ పైనే ఆధారపడుతున్నాం. అలాంటి ఫోన్ ఒక్కసారిగా పని చేయడం ఆగిపోతే చెప్పలేని ఆదుర్దా ఏర్పడుతుంది. అందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఫాస్ట్బూట్ మోడ్. ఎందుకంటే ఆ పరిస్థితిని తొలగించాలంటే ఏం చెయాలో వెంటనే తోచదు. అసలు ఇది ఎందుకు ఏర్పడుతుంది? ఫాస్ట్బూట్ మోడ్‌లో ఫోన్ అగిపోతే, పరిష్కార మార్గాలు, డేటా రికవరీ ఎలా చేయాలో తెలుసుకుందాం..
ఫాస్ట్ బూట్ మోడ్ అనేది ఒక ప్రోటోకాల్ (టూల్).. ఇది ఫోన్ ఫ్లాష్ మెమోరీకి డేటాను అందించడానికి, రీఫ్లాష్ పోర్షన్, రికవరీల్లో ఫ్లాష్ ఇమేజ్‌లు, బూట్ లోడర్లు, కెర్నెల్స్తో పాటు ఫ్లాష్ ఫైల్ సిస్టమ్‌ను అప్డేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ బ్యాకప్‌లను పునరుద్ధరించడానికీ ఉపయోగ పడవచ్చు. అంటే ఇది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (ఎస్డీకె)తో పాటు వచ్చే చిన్న పరికరం. అంతేకాదు ఇన్‌స్టాలేషన్స్, అప్డేట్లకు సంబంధించిన రికవరీ మోడ్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే పరికరం. అన్ని ఫోన్లు ఫాస్ట్ బూట్ మోడ్ కలిగి ఉండవు. నెక్సెస్ డివైజ్లతో పాటు మరికొన్ని ఫోన్లు, టాబ్లెట్స్ మాత్రమే ఫాస్ట్ బూట్ మోడ్‌ను కలిగి ఉంటాయి. ఇది డీఫాల్ట్‌గా ఆన్ అవుతుంది.
ఎలా వస్తుంది : అన్ని ఫోన్లలో ఈ ఫీచర్ ఉండకపోయినప్పటికీ ఉన్న వాటిలో ఆటోమేటిక్‌గానే ఎనేబుల్ చేసి ఉంటుంది. అయినప్పటికీ ఈ సమస్య అందరికీ ఏర్పడదు. ఫోన్ రూటింగ్‌ను ఎంచుకున్నపుడు మాత్రమే ఈ ఫాస్ట్బూట్ మోడ్‌లో ఫోన్ ఆగిపోతుంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ ఫాస్ట్బూట్ మోడ్‌లో ఆగిపోతే, కొన్ని రకాల పద్ధతులు ఉపయోగించి ఆ పరిస్థితి నుంచి బయటపడొచ్చు. ఇందుకు ముఖ్యంగా మూడు విధానాలు ఉన్నాయి. ఇవి మోటో, లెనోవో, హెచ్‌టీసీ, షావోమీ, వన్‌ప్లస్, శాంసంగ్, శాంసంగ్ గెలాక్సీ నోట్, అసూస్, హవారు, నోకియా, ఒప్పో వంటి ఆండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లకు మాత్రమే వర్తిస్తాయి.
1. క్విక్ ట్రబుల్ షూటింగ్ : అంటే ఫాస్ట్బూట్ మోడ్ నుంచి త్వరగా బయటపడడం. ఇందులో మొదట డివైజ్‌ను రీస్టార్ట్ చేయాలి. పవర్ బటన్‌ను 15 సెకండ్ల పాటు అలాగే ఒత్తి పట్టుకుంటే ఒకసారి వైబ్రేట్ అయి రూబూట్ అవుతుంది. బ్యాటరీ ఉన్న ఫోన్లకు బ్యాటరీని తీసేసి కొద్ది నిమిషాలు పక్కకు పెట్టాలి. మళ్ళీ బ్యాటరీ పెట్టి ఆన్ చేయాలి. ఫోన్‌ను బట్టి ఈ పద్ధతి మారుతుంటుంది. ఇన్‌బుల్ట్ బ్యాటరీ ఉన్న ఫోన్లలో ఇది వర్తించదు. అందువల్ల దీనిని సర్వీసు సెంటర్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పద్ధతి వల్ల ఉపయోగం లేకుంటే కొన్ని అడ్వాన్స్డ్ పద్ధతులనూ ఉపయోగించుకోవచ్చు.
2. ట్రై మల్టీ టూల్స్ : ఫాస్ట్ బూట్ మోడ్ నుంచి బయట పడేందుకు మరో విధానం అనుసరించాల్సి ఉంటుంది. అదే ఆండ్రాయిడ్ మల్టీ టూల్. థాయిలాండ్‌లోని జీఎస్ఎం ఫోరం సభ్యుడు వీ1.02బి అనే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. దీనిని టెక్నికల్ నాలెడ్జ్ లేని వారు కూడా సులువుగా ఉపయోగించేలా ఉంటుంది. దీనిని విండోస్ పీసీలో డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది. విండోస్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫాస్ట్బూట్లో స్ట్రక్ అయిన ఫోన్‌ను కనెక్ట్ చేసి అందులోని సూచనలు పాటిస్తే సరి. ఫాస్ట్బూట్ నుంచి బయటపడొచ్చు.
3. మినిమల్ ఏడీబీ : ఈ ఫాస్ట్బూట్ టూల్ అన్ని ఆండ్రాయిడ్ రూట్లకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనిని బూట్ లోడర్ అన్‌లాక్ చేయడానికి, కస్టమ్ రికవరీకి, ఫ్లాష్ కస్టమ్ రోమ్తో పాటు ఫాస్ట్బూట్ లోని థర్డ్ పార్టీ యాప్స్‌కు ఉపయోగ పడుతుంది. ఇందుకు విండోస్ పీసీలో ఎస్డీకే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాల్సిన పనిలేదు. విండోస్ కంప్యూటర్‌కు ఆండ్రాయిడ్ ఫోన్‌ను కనెక్ట్ చేసేందుకు అవసరమైన ఏడీబీ డ్రైవర్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంటుంది. ఏది ఏమైన ప్పటికీ ఇది ఫాస్ట్ బూట్ నుంచి బయట పడేం దుకు బాగా పనిచేస్తుంది. కానీ కొంచెం కష్టతర మైనది, టెక్నికల్‌గా ఉపయోగించాల్సినది కూడానూ. అయితే టెక్నికల్‌గా పట్టు ఉన్న వారికి దీనిని ఉపయోగించడం అసలు సమస్య కాదు. ఈ ఏడీబీని ఉపయోగించాల్సి చేయాల్సినవి...
- మినిమల్ ఏడీబీ అండ్ ఫాస్ట్ బూట్ టూల్‌ని విండోస్ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి.
- ఇన్స్టాల్ అయిన ఏడీబీ ఫోల్డర్‌ను ఓపెన్ చేయాలి.
- ఆ ఫోల్డర్లో ఏదో ఒక ప్రదేశంలో 'షిఫ్ట్ + మౌస్ రైట్ కీ' ప్రెస్ చేసి పట్టుకుని తర్వాత 'ఓపెన్ కమాండ్ విండో హియర్' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- యూఎస్బీ సాయంతో ఫాస్ట్బూట్లో స్ట్రక్ అయిన ఫోన్‌ను విండోస్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేయాలి.
- ఫోన్ కనెక్ట్ అవ్వగానే కమాండ్ విండోలో 'ఫాస్ట్బూట్ డివైజెస్' అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి.
- చివరిగా 'ఫాస్ట్బూట్ రీబూట్' కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి.
ఇది ఆండ్రాయిడ్ ఫోన్ ఫాస్ట్బూట్ మోడ్ నుంచి బయటపడేందు కు సహాయపడుతుంది.
డేటా రికవరీ : ఫాస్ట్బూట్లో ముఖ్యమైన డేటాను పోగొట్టుకుంటే, ఆ డేటాను తిరిగి పొందడం చాలా అవసరం. ఇందుకు ఆండ్రాయిడ్ డేటా రికవరీ అనే సాఫ్ట్వేర్ విండోస్, మ్యాక్ కంప్యూటర్లలో అందుబాటులో ఉంది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, మెసేజ్‌లు, వాట్సాప్ చాట్ కన్జర్వేషన్లు, కాల్ హిస్టరీ, కాంటాక్ట్‌లు, నోట్లు, వీడియో మెమోలు, డాక్యుమెంట్లు వంటి అన్ని రకాల ఫైళ్ళని తిరిగి పొందవచ్చు. అయితే పోయిన డేటా తిరిగి పొందాలనుకుంటే ఆ ఫోన్లో కొత్త డేటా ఏదీ రాకుండా చూసుకోవాలి. అలా వస్తే పాత డేటా రికవరీ అయ్యే అవకాశం ఉండదు.
ఈ విధానాలను ఉపయోగించి ఫాస్ట్ బూట్ మోడ్‌లో స్ట్రక్ అయిన ఫోన్‌ను మామూలు స్థితికి తీసుకురావచ్చు. పోయిన డేటాను తిరిగి పొందవచ్చు.
Authorization