గూగుల్ పే కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆ కోవలోనే ఫాస్టాగ్ ఆప్షన్ తీసుకువచ్చింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇకపై గూగుల్ పే యాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఫెసిలిటీ ద్వారా ఫాస్టాగ్ అకౌంట్లను సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు గూగుల్ పే యాప్ ద్వారానే ఫాస్టాగ్ అకౌంట్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ హిస్టరీని కూడా చెక్ చేసుకోవచ్చు. దీంతో గూగుల్ పే ఉపయోగిస్తున్న వాహనదారులు ఇకపై సులభంగానే ఫాస్టాగ్‌లను రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ వినియోగించుకోవాలంటే.. ముందగా బిల్ పేమెంట్స్ సెక్షన్లోకి వెళ్లి ఏ బ్యాంక్ ఫాస్టాగ్‌ను వాడుతున్నారో ఆ బ్యాంక్‌ను ఎంచుకొని అకౌంట్‌ను లింక్ చేసుకోవాలి. గూగుల్ పే యాప్‌లో ఫాస్టాగ్ అకౌంట్‌ను సెట్ చేసుకున్న తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని వివరాలు ఎంటర్ చేసిన తర్వాత యూపీఐ సాయంతో ఫాస్టాగ్ అకౌంట్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. రీచార్జ్‌లకు సంబంధించిన అన్ని వివరాలు, ఫాస్టాగ్‌లో మిగిలి ఉన్న డబ్బు, ఇతర సపోర్ట్ లింక్స్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. ఇకపోతే కేవలం గూగుల్ పే మాత్రమే కాకుండా పేటీఎం సహా ఇతర సంస్థలు కూడా కస్టమర్లకు ఫాస్టాగ్ సర్వీసులను అందుబాటులో ఉంచాయి. బ్యాంకులు, డిజిటల్ పేమెంట్స్ సర్వీస్ సంస్థలు, ఇతర రిటైలర్లు వాహనదారులకు ఫాస్టాగ్ సేవలను అందిస్తున్నారు.
Authorization