స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వాట్సాప్ వాడకం సర్వసాధారణం.. మెసేజెస్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్.. ఇలా ప్రతి దానికి ఎక్కువగా వినియోగిస్తూనే ఉంటారు. వాట్సాప్ కూడా ఎప్పటిక్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. అయితే వాట్సాప్ ఈ మధ్య కొన్ని లోపాలను గుర్తించింది. వాట్సాప్‌లో ఉన్న లూప్ హౌల్ ఆధారంగా ఏకంగా అమెజాన్ సీఈవో, అపర కుబేరుడు జెఫ్ బెజోస్ స్మార్ట్ఫోనే హ్యాక్ అయిందని వార్తలు రావడం మరింత సంచలనంగా మారింది. ఈ విషయం వాట్సాప్ భద్రతపై మరింత సందేహాలను రేపింది. అమెరికాకు చెందిన నేషనల్ వల్నర్ బులిటీ డేటాబేస్ (చీVణ) అనే డేటాబేస్ వాట్సాప్‌లో గతేడాది 12 వల్నరబులిటీలను కనుగొన్నట్లు తెలిపింది. ఇందులో మొత్తం ఏడు వల్నరబులిటీలు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపింది. ఇందులో -2019-11933 అనే కోడ్ నేమ్ గల లోపం ద్వారా ఫోన్ పని చేయకుండా చేసే అవకాశం హ్యాకర్లకు లభిస్తుందని, వాట్సాప్ 2.19.291, అంతకు ముందున్న వెర్షన్లలో ఈ లోపం తలెత్తిందని చీVణ తెలిపింది. అలాగే జVజు-2019-3568 కోడ్ నేమ్ ఉన్న లోపం అయితే మీ స్మార్ట్ ఫోన్‌ను ఏకంగా హ్యాకర్లు నియంత్రించేలా చేస్తుంది. ఇది గత సంవత్సరం మేలో మొదటిసారి వెలుగులోకి వచ్చింది. వాటితో పాటు ఇజ్రాయేలీ స్పైవేర్ పెగాసస్ అయితే ప్రపంచ వ్యాప్తంగా 100 మందికి పైగా ఫోన్లను హ్యాక్ చేసే అవకాశం ఆయా దేశాల ప్రభుత్వాలకు అందించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ స్పైవేర్ బారినపడ్డ దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఇదొక్కటే కాకుండా వీడియో ద్వారా, జిఫ్ ఫైల్స్ ద్వారా ఫోన్లను హ్యాక్ చేసే లోపాలు వాట్సాప్‌లో ఉన్నట్లు కొందరు పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాకుండా గ్రూపుల్లో ఒక మెసేజ్ పంపడం ద్వారా మొత్తంగా వాట్సాప్‌నే క్రాష్ చేసే లోపాన్ని కూడా పరిశోధకులు గతేడాది ఆగస్టులో కనుగొన్నారు. మనం తరచూ చూసే ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఫుల్ సెక్యూర్డ్ అనుకుంటున్నారా? కానీ అదసలు సెక్యూరిటీనే కాదని వాట్సాప్ ధ్రువీకరించింది. కాబట్టి ఇకపై వాట్సాప్‌ను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనుమానాస్పద లింకులు, వీడియోలు, జిఫ్‌లను క్లిక్ చేయకుండా ఉండటం, ఫార్వార్డ్ చేయకుండా ఉంటే మంచిదేమో..!
Authorization