స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి దగ్గరా వాట్సాప్ తప్పనిసరి. తెలిసో, తెలియకో చేసే కొన్ని పనులు ఇరకాటంలో పెడుతుంటాయి. ఇందులో ఎక్కువగా ప్రభావితమయ్యేది గ్రూపులే.. గ్రూపులపై పోలీసుల నిఘా ఉంటోంది. వాట్సాప్ తన మాతృ సంస్థ అయిన ఫేస్బుక్ ద్వారా ప్రతి వినియోగదారుడి వ్యక్తిగత సమాచారాన్ని పొందగలదు. అనంతరం దాన్ని న్యాయ సంబంధిత సంస్థలకు అవసరమైనప్పుడు అందిస్తుంది. ఇందులో మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ కాబట్టి పోలీసులు నేరస్తుడి పేరు, మొబైల్ నంబర్, లొకేషన్, మొబైల్ నెట్వర్క్, మొబైల్ హ్యాండ్ సెట్ టైప్ వంటి వాటిని పొందవచ్చు. ఎవరితో చాట్ చేస్తారో కూడా తెలుసుకోగలరు. మన దేశంలో వాట్సాప్‌కు ప్రత్యేకంగా ఎటువంటి చట్టాలు లేవు కాబట్టి ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారం పోలీసులు అరెస్ట్ చేస్తారు. చాలా మంది ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ పెట్టాం.. సేఫ్ సైడ్‌లో ఉన్నాం అనుకుంటారు. అయితే పట్టుకోవడం కాస్త కష్టమవుతుందంతే.. కానీ అసాధ్యం మాత్రం కాదు. అసలు ఏయే అంశాలపై పోలీసులు నిఘా ఉంచారో తెలుసుకుందాం..
దేశంలో జరుగుతున్న అత్యాచారాల్లో అధిక భాగం పోర్న్ కారణంగా జరుగుతున్నాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. చైల్డ్ పోర్న్ విషయంలో అయితే నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. అందువల్ల వాట్సాప్‌లో పోర్న్‌కు దూరంగా ఉండటం మంచిది.
వాట్సాప్‌లో మహిళలను ఇబ్బంది పెట్టేలా మెసేజ్‌లు పంపినట్టు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే తిప్పలు తప్పవు. పోలీసులు ఈ మధ్య ఇటువంటి విషయాల్లో వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.
ప్రముఖులకు సంబంధించిన మార్ఫ్డ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం శిక్షార్హం. ఇటువంటి ఫొటోలు, వీడియోలు షేర్ చేసే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.
వాట్సాప్‌లో ఏదైనా ఆసక్తికరమైన విషయం కనిపిస్తే.. అందరికీ షేర్ చేస్తూంటారు. అలా చేసేది నకిలీ వార్త అయితే కఠిన చర్యలు తప్పవు.
వేరొకరి పేరుతో వాట్సాప్ ఖాతాను ఓపెన్ చేయడం, వారిలా చాట్ చేసినా కఠిన శిక్ష తప్పదు. సదరు వ్యక్తి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉంది.
ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. ఒక్కో మతంలో వివిధ నమ్మకాలున్నాయి. మతానికి, ప్రాంతానికి, నమ్మకాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా మెసేజ్‌లు పెడితే అల్లర్లు జరిగే అవకాశాలు ఉండడంతో పోలీసులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గ్రూపుల్లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన మెసేజ్‌లు పంపితే.. ఆ గ్రూపు అడ్మిన్‌దే బాధ్యత..
నిషేధిత వస్తువుల అమ్మకాలను వాట్సాప్ ద్వారా అమ్మడం చట్టరీత్యా నేరం. సరదాగా నిషేధిత వస్తువులు ఉన్నాయని పోస్టులు పెట్టినా సమస్యల్లో ఇరుక్కుంటారు.
హిడెన్ కెమెరా వీడియోలు పంపడం, వేరే వారికి తెలియకుండా వారి వీడియోలు రికార్డ్ చేసి పంపడం కూడా నేరమే. ఇటువంటివి షేర్ చేసినా కటకటాల పాలు కావడం ఖాయం.
Authorization