ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్త కొత్త ఫీచర్లను అందించడంలో వాట్సాప్ ముందుంటుంది. ఇప్పటివరకు అందించిన వాటిల్లో డిలీట్ ఫర్ఎవర్ ఫీచర్ ఒకటి. ఇది చాటింగ్ సమయంలో ఒకరికి మెసేజ్ పంపబోయి పొరపాటున వేరేవారికి పంపిస్తే, వారు చూడకముందే దానిని డిలీట్ చేసే ఆప్షన్. వ్యక్తిగతంగా పంపినా, గ్రూప్‌లో పంపినా డిలీట్ చేసెయొచ్చు. పంపిన మెసేజ్ డిలీట్ చేయడానికి గంట వరకు మాత్రమే సమయం ఉంటుంది. అయితే అవతలి వారికి అసలు కనిపించదు అని కాదు. ఈ మెసేజ్ అందరికీ డిలీట్ అయిందో లేదో తెలుసుకునేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ఇద్దరూ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఉపయోగిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే పంపిన మెసేజ్ అవతలి వారి ఫోన్లలో డిలీట్ అవుతుంది.
ఒకవేళ ఐఫోన్ వినియోగదారులకు ఫొటో పంపి దాన్ని డిలీట్ చేయాలనుకుంటే కష్టమే. ఎందుకంటే ఐఫోన్ తన గ్యాలరీ స్టోరేజ్‌లోకి వాట్సాప్‌ను అనుమతించదు. అందువల్ల ఐఫోన్ వినియోగించేవారికి ఫొటోలు పంపేపుడు జాగ్రత్త.
మార్చిలో ఆరు రోజులు బ్యాంకులు బంద్...Click Here
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సమస్య తలెత్తదు. వీడియోలు, ఫొటోలు వాట్సాప్‌తో పాటు గ్యాలరీ నుంచి కూడా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి.
ఒకవేళ పొరపాటున పంపిన లేదా పంపకూడని మెసేజ్ పంపినా అనే విషయం మీరు గమనించే లోపల అవతలి వారు చూసి ఉంటే డిలీట్ చేసినా ఉపయోగం లేదు. లేదా పైన తెలిపిన కారణాల వల్ల మెసేజ్ డిలీట్ అవ్వకపోయినా మీరు పంపిన మెసేజ్ లేదా ఫొటో, వీడియోలను వారు చూడవచ్చు. ఒకవేళ నోటిఫికేషన్ బార్ ద్వారా చూసి ఉంటే ఆ విషయం మీకు తెలిసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి జాగ్రత్త అవసరం.
ఒకవేళ మీరు పంపిన మెసేజ్ డిలీట్ అవ్వకపోయినా మీకు దీని గురించి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏదీ మీకు రాదు.
పంపిన మెసేజ్ డిలీట్ చేసినా ఆ విషయం అవతలి వారికి తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ''దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్'' అని కనిపిస్తుంది. అలా చూసిన వారు అడుగుతారు కదా.. ఏం పంపించావు అని. అందువల్ల జాగ్రత్త వహిస్తే మంచిది.
Authorization