వెబ్‌లో ఏదైనా సెర్చ్ చేస్తున్నా, ఏవైనా చాటింగ్ మెసేజ్‌లు, సమాచారం వంటివి స్క్రీన్ షాట్ తీస్తుంటాం. ప్రస్తుతం స్క్రీన్ షాట్ కూడా అవసరమైన ఫీచర్‌గా మారిపోయింది. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు వినియోగదారుల అవసరాన్ని బాగా అర్థం చేసుకుని స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. అంటే స్క్రీన్ షాట్ స్టార్ట్ చేసి మనం ఒక పేజీలో ఎంత మేరకు రోల్ చేస్తామో అంతమేరకు స్క్రీన్ షాట్ ఇమేజ్ వస్తుంది. అయితే యాపిల్‌లోనూ ఇలాంటి ఫీచర్ ఒకటి ఉంది. కానీ ఈ ప్రక్రియ మిగతా ఫోన్లతో పోలిస్తే కాస్త కష్టమే. వినియోగదారులకు ఉపయోగపడే ఈ విధానం గురించి తెలుసుకుందాం..
ఏ వెబ్ పేజీని స్క్రీన్ షాట్ తీయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. ఇప్పుడు మీ ఐఫోన్లో Assistive touc ద్వారా స్క్రీన్ షాట్ తీయాలి. ఒకవేళ మీరు ఐఫోన్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లు వాడుతుంటే, హౌం బటన్, పవర్ బటన్‌ను కలిపి పట్టుకుని కూడా స్క్రీన్ షాట్ తీయవచ్చు. దాని కంటే ముందు వెర్షన్ ఐఫోన్లు అయితే.. వాల్యూమ్ అప్ బటన్, పవర్ బటన్‌ను కలిపి పట్టుకుని స్క్రీన్ షాట్ తీయవచ్చు. స్క్రీన్‌షాట్ తీయగానే స్క్రీన్కు ఎడమవైపు కింద భాగంలో ఉండే ఇమేజ్ ప్రివ్యూపై క్లిక్ చేయాలి. ఆ ప్రివ్యూకు పై భాగంలో Screen, Full Page అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో Full Page త్రవ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ ఫోన్లో ఫుల్ పేజీ స్క్రీన్‌షాట్ రెడీ అవుతుంది. అందులో ఉండే ఆప్షన్ ద్వారా, కావాల్సినంత వరకు పేజీని కట్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు లేదా సేవింగ్ వద్దనుకుంటే ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఈ స్క్రీన్‌షాట్ సేవ్ చేస్తేDone ఫార్మాట్లో సేవ్ అవుతుంది. షేరింగ్ కోసం కుడివైపు పైభాగంలో ఉండే షేర్ బటన్ పై క్లిక్ చేయాలి. సేవింగ్ కోసం ఎడమవైపున పైభాగంలో ణశీఅవ బటన్‌పై క్లిక్ చేసి, కావాల్సిన లొకేషన్లో సేవ్ చేసుకోవచ్చు.
Authorization