జీమెయిల్ అందరికీ తెలిసిన ఈ మెయిల్. ఇందులో ఏదైనా ముఖ్యమైన విషయాలు, చిన్న చిన్న ఫైళ్ళు పంపించుకుంటుంటాం. అలాగే మనకు వచ్చిన మెయిల్స్‌లను వేరే వారికి పంపేందుకు ఫార్వార్డ్ చేస్తుంటాం.. అయితే ఈ మధ్య గూగుల్ జీమెయిల్ ఒక ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే ఫార్వార్డ్ అవసరం లేకుండా మెయిల్స్ సెండ్ చేయడం. దీని ద్వారా ఈ-మెయిల్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఎన్ని ఈ-మెయిళ్ళను అయినా అటాచ్ చేసే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తుంది. ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులు ఈ-మెయిల్స్‌ను అటాచ్మెంట్గా జోడించి సులభంగా ఈ-మెయిల్ చేయగలుగుతారు. ఇలాంటి ఫైళ్ళన్నీ ''.eml'' ఫైల్‌గా మారతాయి. వాటిపై క్లిక్ చేసినప్పుడు కొత్త విండోలో ఓపెన్ అవుతాయి. అయితే ఇందుకు రెండు పద్ధతులున్నాయి.
మొదటి పద్ధతిలో బ్రౌజర్లో జీ-మెయిల్ ఓపెన్ చేసి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఇన్‌బాక్స్‌లో, ఈ-మెయిల్స్ పక్కనున్న టిక్బాక్స్పై క్లిక్ చేసి అటాచ్ చేయాలనుకున్న ఈ-మెయిల్స్‌ను సెలెక్ట్ చేసుకుని, కంపోజ్ బటన్‌పై క్లిక్ చేసి, ఎంచుకున్న అన్ని మెయిల్స్‌ను ఈ-మెయిల్ కంపోజ్ బాక్స్‌లోకి డ్రాగ్ చేయాలి. ఆ ఈ-మెయిళ్ళన్నీ సాధారణ అటాచ్మెంట్గా మారిపోతాయి.
రెండో పద్ధతిలో షేర్ చేయాలనుకుంటున్న ఈ-మెయిల్స్‌ను ఎంచుకుని పైన ఉన్న ఓవర్‌ఫ్లో (3-డాట్) మెనూపై క్లిక్ చేయాలి. ఎంచుకున్న ఈ-మెయిళ్ళను అటాచ్మెంట్గా జోడించడానికి 'ఫార్వర్డ్ అటాచ్మెంట్' బటన్ పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు రిప్లై -మెయిల్లో, ఈ-మెయిల్స్‌ను యాడ్ చేయాలనుకుంటే, కుడివైపు పైభాగంలోని 'పాప్ అవుట్ రిప్లై' బాక్స్‌పై క్లిక్ చేస్తే ఒక మెయిల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. పైన పేర్కొన్న పద్ధతుల మాదిరిగానే ఫార్వర్డ్ చేయాలనుకుంటున్న ఈ-మెయిల్స్‌ను డ్రాగ్ చేయాలి. ఈ ఫీచర్ ప్రస్తుతానికి డెస్క్‌టాప్ వెర్షన్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మొబైల్స్‌కు వచ్చే అవకాశం ఉంది.
Authorization