Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తులలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఒకరు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. ఒక నిరుపేద సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన కలాం, అత్యున్నత పదవిలో ఉన్న కూడా నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. 1931 లో తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం లో జన్మించిన కలాం రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చాడు. తన పదవి కాలం పూర్తయిన కూడా విశ్రాంతి తీసుకోకుండా తన కిష్టమైన బోధన పట్ల మక్కువ చూపిన గొప్ప అధ్యాపకుడు, దార్శనికుడు. ఐ. ఐ.యం షిల్లాంగ్ లో లెక్చర్ ఇస్తూ 2017 జూలై 27న కుప్ప కూలిపోయాడు . కలాం జీవితాంతం విశ్రాంతి లేకుండా పని చేశాడు. ఆయన యువతకు ఆదర్శవంతమైన సూక్తులు బోధించాడు. అందులో కొన్ని గమనిస్తే ,
-తొలి విజయం సాధించాక ఆగి పోకండి, మొదటిసారి గెలిచి రెండోసారి ఓడితే తొలి విజయం అదృష్టవశాత్తు వచ్చిందంటారు అని యువతకు సందేశాన్నిచారు.
కలలు కనండి.... ఆ కలలు సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించాలి అనే సూక్తి యువతకు ఆదర్శం..
-మనిషికి కష్టాలు ఎంతో అవసరం.. కష్టాలు వచ్చినప్పుడే విజయాన్ని ఆస్వాదించగలం అని యువతకు జీవిత సారాంశాన్ని బోధించాడు.
మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు, కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర ను సృష్టించేది గా ఉండాలి..అన్నారు .
అందం ముఖంలో ఉండదు,, సహాయం చేసే మనసు లో ఉంటుంది.
ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయం తో సమానం. కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది.
ఒకసారి క్లాసులకు బం క్ కొట్టి స్నేహితులతో ఆనందంగా గడపండి. ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలే మనకు ఆనందాన్ని కలిగిస్తాయి తప్ప మార్కులు కాదు..
మీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం రాదు, కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి రాదు..
సక్సెస్ అంటే... మీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారడమే...
మీరు మీ భవిష్యత్తును మార్చలేరు కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు, కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తు ను మారుస్తాయి..
ఇతరులను ఓడించడం సులువే కానీ, ఇతరుల గెలవడం కష్టం... యువత ప్రతిరోజు ఎన్నో వాగ్దానాలు, కలలుకంటారు అంటూ, ఆ కలలు సా అగుటకు మనం చేసే పని కొన్ని సందర్భాల్లో నిరాశపరుస్తుంది, కాని మీరు మనసులో ఉంచుకొన్న ఆ కల సాకారం సాధ్యం అవ్వాలంటే ఆ కల వైపు పరిగెత్తిన ప్పుడే జీవితానికి అర్థం ఉంటుందని చాలా సందర్బాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తన ప్రసంగాల ద్వారా విశ్వవిద్యాలయాలలో, వివిధ వేదికల ద్వారా యువతకు స్పూర్తినిచ్చే అంశాలు బోధించారు. అందుకే నేటి యువత కలాం ను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు లక్ష్యసాధనకు కృషి చేసే విధంగా ముందుకు వెళుతూ నవ భారత నిర్మాణం లో తమ వంతు పాత్ర పోషించాలని ఆశిద్దాం....
- రావుల రాజేశo ,జమ్మికుంట,కరీంనగర్
9848811424