Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎక్కడికైనా చొచ్చుకుపోయే గుణం. సమస్య తెలిస్తే దృష్టికొస్తే చాలు అక్కడ వాలిపోతారు. అవసరమైతే కొంత సాయం కూడా చేస్తారు. ఈ సుగుణాలే కాకుండా... ఆయనలో హాస్య చతురత కూడా పుష్కలంగా ఉన్నది. ఆయన మాటలకు ఎవరైనా కడుపుబ్బా నవ్వాల్సిందే. హైదరాబాద్ యాసలో మాట్లాడే తీరు నలుగురిని ఆకట్టుకుంటుంది... ఏ స్థాయి సమావేశమైనా... ఆయన వెళ్లి కూర్చుంటారు. సీనియర్ నాయకుడు కాబట్టి కూర్చోనిరులేఅనుకుంటారు. ఆయనే మన హనుమంతన్న. కానీ దుబ్బాక సమావేశంలో సీన్ రివర్సయింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ఆధ్యర్యంలో దుబ్బాక నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతున్నది. ఆ సమావేశంలో కూర్చొవడానికి ప్రయత్నించారు. ఠాగూరు జోక్యం చేసుకుని మీకు ఆహ్వానం లేదు కదా అన్నారు. సీనియర్ నాయకున్ని నాకు అవకాశం ఉంటుంది కదా? సీనియర్ అయితే ఏంది. ఆహ్వానం లేనప్పుడు సమావేశానికి రాకూడదు. వెళ్లిపోండి. మీతో ఇక్కడ పనేమీ లేదంటూ నిర్ధ్ధక్షిణ్యంగా పంపించి షాక్ ఇచ్చారు. గతంలో ఎలా ఉందో, ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం పార్టీ నిబంధనలు పాటించాలి. దయచేసి వెళ్లిపోండి, ఉండటం కుదరదు అని తేల్చి చెప్పడంతో హనుమంతన్న షాకయ్యారు అని గాంధీభవన్లో టాక్.
- గుడిగ రఘు