Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు క్యాలెండర్ అంటే తేదీలు, వారాలు తెలుసుకునేందుకు ఉపయోగించుకునే వారు. మహా అయితే ముహుర్తాలు తెలిపే క్యాలెండర్లూ ఉండేవి. కానీ ఆధునిక కాలంలో అన్నింటిలో మార్పులు వస్తున్నట్టే క్యాలెండర్లలలోనూ పలు మార్పులు వస్తున్నాయి. గత కొన్నేండ్లుగా ప్రతి ఏటా పలు సంఘాలు క్యాలెండర్లను ప్రత్యేకంగా రూపొందిస్తున్నాయి. ఆయా సంఘాలు చేసే పనులు సంక్షిప్తంగా పొందుపరుస్తూ వెలువరుస్తున్న ఈ క్యాలెండర్లను ఆ సంఘాల సభ్యులు ఆసక్తితో తీసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో జనరల్ క్యాలెండర్ ఉన్నప్పటికీ తమ ఉద్యోగ, ప్రజాసంఘాలకు సంబంధించిన మరో క్యాలెండర్ ఉంచుకోవడం ఆనవాయితీగా మారింది. మరో వారం రోజులు గడిస్తే కొత్త ఏడాదిలో ప్రవేశించనున్న సమయంలో కొత్త క్యాలెండర్ల డిజైన్లు, అందులో పొందుపరిచే సమాచారాన్ని ఫైనల్ చేసే పనిలో నేతలు పడ్డారు. 2021 క్యాలెండర్లలో ప్రత్యేకతలు ఎన్ని ఉంటాయో వేచిచూడాలి.
-ప్రియకుమార్