Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంచలంచెలుగా ఎదిగి పార్టీలో ఉన్నత శిఖరానికి చేరుకున్నారు. రాజకీయంగా పార్టీకి లాయలిస్టు అన్న బలమైన కోటను నిర్మించుకున్నారు. పార్టీకి వీర విధేేయుడు అన్నమాట. అంతటి రాజకీయ సైనికుడే పప్పులో కాలేశాడు అంటున్నారు నెటిజన్లు. పార్టీని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ డబ్బులకు అమ్ముడు పోయాడంటూ విమర్శలు గుప్పించాడు. రేవంత్రెడ్డి వద్ద డబ్బులు తీసుకుని పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకుంటున్నాడని పరోక్షంగా వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాకూడదనే ఒకే లక్ష్యం అయనది. ఇది ఆయన చాలాసార్లు బహిరంగంగా చెప్పిండు. అయితే అధిష్టానం నిర్ణయం తీసుకోక ముందే ఇప్పుడు ఆగ్రహా వేశాలు ప్రదర్శించారు. ఈ వ్యాఖ్యలతో ఫోకస్ అంతా ఆయనపై పడింది. ఫలితంగా పార్టీకి ఎంతో లాయలిస్టు అయినా తాజాగా పార్టీలో పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా... అనేక పదవులు చేపట్టినా... కలివిడిగా ఉంటూ నవ్విస్తారు, ఏడిపాస్తారు, గర్జిస్తారు, గాండ్రిస్తారు. ఏం చేసినా సంచలనమే అనేది తెలిసిన విషయమే... అటువంటి నాయకుడైన వీహెచ్ భవిష్యత్తు త్వరలో తేలనుంది. అయ్యోపాపం హన్మంతన్న..
- గుడిగ రఘు