Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు నా దేశపు నాగలి
రాజధాని నేలనే కాదు
రాజ్యపాలననూ దున్నుతున్నది.
సమత కోసం నాడు
భగత్‌సింగ్ పూరించిన
సమర శంఖం
అవని అంతటా నేడు
ప్రాణవాయువులు
ఊదుతున్నది
కలాలే కాదు జెండాలు కూడా
హలాలతో పాటు పొలాల బాట
పట్టాల్సిందేనని అంతరాత్మలు
చెపుతున్నాయి.
నీటి ఫిరంగులు
లాఠీ తూటాలు
ఎదురొస్తున్న రైతు పాదాన్ని
తప్పించుకు పారిపోతున్నాయి
యుద్ధంలో అలసిపోతున్న
శత్రు సైనికులకు సైతం
అన్నం పెట్టే ఆపన్న హస్తాన్ని
చూస్తున్నాంకదా..!
తెగించిన పోరాట ప్రేమకు
జాతి గుండెలు
కృతజ్ఞతాపూర్వంగా
ఎగిసి ఎగిసి పడుతున్నాయి.
నేలతో పాటు
నా రైతు పాదానికి
మోకరిల్లి ప్రాణాలతో
ప్రాణమిల్లాలని ఉంది.
ప్రజాస్వామ్యాన్నీ
కాపాడే బిడ్డలు
ఎప్పటికప్పుడు
పుడుతూనే ఉన్నారని
చారిత్రిక తల్లి
మట్టు చాటునుండి
ఆనంద భాష్పాలు వర్షిస్తున్నది.
- కె.శాంతారావు
సెల్:9959745723