Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచానికి విశ్వ రహస్యా లను విప్పిచెప్పిన ''సర్ ఐజాక్ న్యూటన్'' ఒక భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. అంతేకాక సిద్ధాంత కర్త, తత్వవేత్త. ప్రకృతి సిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కషికిగానూ ఆధునిక ప్రపంచం అంతా ఆయనను ''సైన్సు పితామహుడు''గా అంగీకరించింది. 1643 జనవరి 4న ఇంగ్లండ్‌కు దగ్గర్లోగల ''ఉల్‌తోప్'' అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. న్యూటన్ తండ్రి, న్యూటన్ జననానికి మూడు నెలల ముందు మరణించారు. న్యూటన్ తన తల్లి దగ్గర మూడేండ్ల వయస్సు వరకు పెరిగాడు. తరువాత ఆమె ''బార్ స్మిత్'' అనే ఆయన్ని రెండవ వివాహం చేసుకున్నారు. అందువలన న్యూటన్ తన చిన్నతనంలో తన తల్లితండ్రుల ప్రేమ కోల్పోయి తన అమ్మమ్మ-తాతల వద్ద పెరగాడు. తన బలహీనమైన ఆరోగ్యం వలన ఆటల వైపు ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు కాదు. ఆయన చాలా తక్కువగా మాట్లాడుతూ, ఎక్కువగా ఆలోచించే వాడు.
న్యూటన్ చిన్నప్పుడు తరగతి గది చదువుకంటే ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటినే చిన్న సైజులో తయారు చేయటం లాంటి పనులు ఆనందంగా చేసేవాడు. చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారం లాంటివి కూడా ఆయన తయారు చేశాడు. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ ''లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో'' ఉన్నాయి.
స్కాలర్షిప్ లేకుండా ఉన్నత విద్యను కొనసాగించడం సాధ్యపడదని గ్రహించిన న్యూటన్, స్కాలర్ షిప్ కోసం ఎంతో ప్రయత్నించినా, మార్కులు తక్కువ వచ్చిన కారణంగా స్కాలర్షిప్ పొందలేకపోయాడు. అయినప్పటికి యూనివర్సిటీ బోర్డు సభ్యులు ఆయనకు నాలుగేండ్ల వరకు స్కాలర్షిప్ ఇచ్చారు. తనకు నచ్చిన అంశాలపై పరిశోధించడం కోసం స్కాలర్ షిప్ వచ్చినందున చాలా సంతోషించాడు. ఈ వచ్చిన అవకాశాన్ని వీలైనంత సద్వినియోగం చేసుకోవాలని న్యూటన్ నిశ్చయించుకున్నాడు. న్యూటన్ పూర్తి సమయం ''లెక్కలు, భౌతిక శాస్త్రం'' అభ్యాసానికే వినియోగించాడు. ఎంతలా నిమగమయ్యారంటే ఒక్కొక్కసారి గడియారంలో సమయం గమనించకుండా, భోజనం, నిద్ర కూడా లేకుండా తన పరిశోధనల్లో ఉండేవాడు. న్యూటన్ యూనివర్సిటీలో గ్రీకు, లాటిన్, హిబ్రు భాషలను, లాజిక్, జ్యామితి, త్రికోణమితిలను ఎంచుకున్నారు. లైబ్రరీ కూర్చున్న సమయంలో తప్పకుండా గొప్ప శాస్త్రవేత్తల పరిశోధనలు చదివేవాడు.
1661లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై మక్కువ పెంచుకున్నాడు. ఆ తరువాత అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడైన న్యూటన్, 1667లో ''పరావర్తన దూరదర్శినిని'' నిర్మించి సంచలనం సష్టించాడు. చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో ''గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని'' ప్రతిపాదించాడు. ''న్యూటన్ మూడు గమన నియమాలు''గా ప్రసిద్ధిగాంచిన గొప్ప విషయాలను సూత్రీకరించాడు.
అందులో మొదటిది, బాహ్యబల ప్రయోగం లేనంత వరకు చలనస్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ ఉంటుంది.'' ఈ వస్తు ధర్మాన్ని ''జడత్వం'' అంటారు. రెండవది, ''ఒక వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు ఆ వస్తువుపై ప్రయోగించిన బలానికి అనుపాతంగా ఉంటుంది. ఆ బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది.'' ఇక మూడవది, ''చర్యకు ప్రతి చర్య సమానంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయును.'' దీని ఆధారంగానే ''రాకెట్స్'' తయారు చేయబడినవి.
భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై గురుత్వశక్తి ఎలా పని చేస్తుందో వివరిస్తూ ''విశ్వ గురుత్వ నియమాన్ని'' ప్రతిపాదిస్తూ, గమన సూత్రాలను నిర్వచించాడు. భౌతికశాస్త్ర భావనలను వివరిస్తూ ''ప్రిన్సిపియా మేథమేటికా'' అనే గ్రంథాన్ని రచించాడు. అది న్యూటన్ యొక్క మహత్తర పుస్తకంగా, 1687లో ప్రచురించబడినది. న్యూటన్ ''1669లో కేంబ్రిడ్జి నుంచి మాష్టర్స్ డిగ్రీ'' పొందాడు. అదే సంవత్సరంలో ''గణిత శాస్త్ర ప్రొఫెసరు'' గా నియమించబడ్డాడు. ఆయనకు 1672లో ''రాయల్ సొసైటీ ఫెలోషిప్'' లభించింది. అప్పటి వరకూ ప్రకతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్ను ''భౌతిక శాస్త్ర పితామహుడు'' అంటారు. 1705లో బ్రిటిష్ ప్రభుత్వం ''సర్'' అని బిరుదునిచ్చి సత్కరించింది. ఇక అప్పటినుంచి ఐజాక్ న్యూటన్, ''సర్ ఐజాక్ న్యూటన్‌గా'' మారిపోయారు.
ప్రొఫెసర్ న్యూటన్ సన్నగా, పొడవుగా ఉండేవాడు. న్యూటన్ తన దుస్తులు, కేశాలంకరణపై ఆసక్తి చూపేవాడు కాదు. ఎక్కువ సమయం అతను తన సొంత ఆలోచనలలో మునిగిపోయేవాడు. ఎప్పుడూ గదిలో ఒక మూలలో లెక్కలు చేసుకునేవాడు. తీవ్రమైన చర్చలలో కూడా ఒక్కోక్కసారి సొంత ఆలోచనలలో ఉండేవాడు. అనేక సందర్భాలలో అతను ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది లేదా పందొమ్మిది గంటలు అధ్యయనంలో గడిపేవాడు. రాయల్ సొసైటీ అధ్యక్షుడు ''రాబర్ట్ హ్కు'' 1703లో మరణించాడు. అప్పుడు ప్రొఫెసర్ న్యూటన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. న్యూటన్ అద్భుతమైన రచయిత. అతను అనేక శాస్త్రీయ, అశాస్త్రీయ విషయాల మీద ఎన్నో పుస్తకాలను రాశాడు. ప్రొఫెసర్ న్యూటన్ బ్యాచిలర్‌గా ఉండి భౌతిక శాస్త్రం, గణిత శాస్త్ర సేవలకే జీవితం అంకితం చేశాడు.
లక్ష్యం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, కష్టాలు వచ్చినా మార్గం, గమ్యం మార్చకూడదనే నియమాన్ని నమ్మి, నేడు విశ్వవ్యాప్తంగా వెలుగొందుచున్న సర్ ఐజాక్ న్యూటన్ మార్చి 20, 1727 రోజున మరణించాడు. న్యూటన్ జీవితం, న్యూటన్ ప్రయోగాలు మానవ మనుగడ ఉన్నన్నాళ్లు సజీవం, ఆదర్శం.
- రఘుపతి రావు గడప
సెల్:9963499282