Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు సమస్త సృష్టికి మూలం స్త్రీ. కా నీ.. నేడు అందరీ చేత వంచింపబడుతూ, తన శీ లానికి రక్షణ కోసం కేకలు వేస్తోంది. ప్రపంచంలో అత్యధి క లైంగిక దాడులు జరుగుతున్న దేశం మ నదేనని మహా గొప్ప పేరు సంపాదించుకున్నాం. పేరుకే అన్నింటిలో సగం. కానీ.. ఇప్పటికీ చాలా మంది దృష్టిలో మహిళలంటే చులకన, దాసులు, పనిమనుషులుగా చూడబడుతున్నారు. అమ్మైనా క్రమక్రమంగా ఆ స్వేచ్ఛను కోల్పోతుంది. అసలు మహిళలపై ఎందుకు ఈ పెత్తందారితనం. మహిళ లు ఏది చేయాలో మీరే నిర్ణయిస్తారా..? ఎలా ఉండాలో గుచ్చి గుచ్చి చెప్తూనే ఉంటారా..? మీ కామవాంఛ తీర్చుకొని మహిళల వస్త్రధారణ పై పిచ్చి కూతలు కూస్తారా? పసి పిల్లలను వదులుతున్నారా? పండు ముసలి వారిని వదులుతున్నారా? మరి పిల్లలు, వద్ధుల వేషధారణ కూడా బాగాలేదా? అందుకే కామకోరలతో కాటేస్తాం అంటారా? మహి ళల వేషధారణ కాదు మీ బుద్ధులు మార్చుకోండి.
స్త్రీగా పుట్టడానికి గర్భం నుండే సందిగ్ధత, ఎన్నో లెక్కలు, మరెన్నో బేరీజులు అన్నీ అయిన తర్వాత ఆడపిల్ల గర్భం నుండి బయటపడాలి. అలా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టకుండానే గర్భాలయంలో సమాధి చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. గర్భం నుండి బయటపడిన తర్వాత అడుగడుగునా భయం, ఆందోళనతో గడపాలి. బాల్యం అందరి జీవితాలలో ఆనందంగా ఉంటుంది. కానీ.. ఆడపిల్లల చిన్ని దేహాన్ని సైతం మీ పశువాంఛకు బలితీసుకుంటున్నారు. బాల్య దశ నుండే ఎన్నో కామచేతుల నుంచి బయటపడాలి. యవ్వనంలో ప్రేమ పేరుతో మాపై దాడులు, సామూహిక లైంగికదాడులు.. అసలెం దుకో ప్రతి కవి, రచయిత స్త్రీ ఇలానే ఉండాలి అని చెప్పాడు కానీ.. ఒక పురుషుడు ఎలా ఉండాలో చెప్పలేదు. బహుశ పితస్వామ్య సమాజం దానికి అంగీకరించలేదేమో! స్త్రీ బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకో వాలి, మగాడు ఆడమన్నట్టు ఆడాలి. ఈ సమాజంలో పురుషుడికి ఉ న్నంత స్వేచ్ఛ స్త్రీకి ఏనాడైతే వస్తుందో అప్పుడే నిజమైన స్వతంత్య్రం వ చ్చినట్టు. పెండ్లి అయిన తర్వాత తన ఇష్టాలన్నీ చంపుకోవాలి, భర్త ఇ ష్టాలే తన ఇష్టాలుగా మార్చుకోవాలి. తన కోరికలు, ఆశయాలు అన్ని వ దులుకోవాలి. భర్త సేవలో తరించాలి. నిజానికి ఇలాంటి సిద్ధాంతాలు చాలా వరకు మారినట్లు అనిపిస్తుంది. కానీ.. నేటికి ఇలాంటి భావజా లంతో స్త్రీ బాధపడుతూనే ఉంది. అసలు స్త్రీ డబ్బు ఇచ్చి పురుషుడిని ఎందుకు కొనాలి? ఎందుకు ప్రభుత్వాలు, న్యాయస్థానాలు వీటిపై ఇం కా కఠినమైన చర్యలు తీసుకోవు. ఇప్పటికి ఎంతోమంది ఆడపిల్లల తల్లి దండ్రులు కట్నం ఇవ్వడానికి ఎంత శ్రమ పడుతున్నారు. నేటికి వరకట్న బాధితుల సంఖ్య ఎందుకు గణనీయంగా పెరిగిపోతోంది. ఇక్కడ కేవ లం ప్రభుత్వాలను దోషులుగా పెట్టలేం. మనిషి ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. అసలు కట్నం ఎందుకు ఇవ్వాలని అలోచించి అలాంటి వ్యవస్థ నుండి బయటపడాలి. మనిషి ఆలోచనలో మార్పు రాకపోతే ఎన్ని చట్టాలు చేసినా ఎంత రక్షణ సమకూర్చినా నేరాలు జరుగుతూనే ఉంటాయి. మీ పిల్లలను చిన్నప్పటి నుండే సరైన మార్గంలో పెంచండి. నేరాలు చేస్తే ఎలాంటి శిక్షలు పడుతాయో వివరించండి. మీ ఇంట్లో ఒ క ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు ఉంటే సమాన దష్టితో చూడండి. సమా నంగా పెంచండి. ప్రతి చిన్నదానికి స్త్రీలో ఎందుకు తప్పులు ఎత్తి చూపు తారు? అంటే భార్య (అమ్మ) ఉన్నది ఇంటిపని చేయడానికేనా..? పెండ్లి అయినప్పటి నుండి కుటుంబం కోసం ఎంతో కష్టపడుతుంది.. ఆమె ఇ ష్టాయిష్టాల గురించి ఒక్కసారైనా ఆలోచించారా..? పెండ్లి, పిల్లలు, పెంపకం, చదువులు వారి పెండ్లిలు తన జీవితమంతా అదే సరిపో తుంది. మళ్లీ మనవళ్లు, మనవరాళ్లనూ పెంచాలి. ఇంక ఎక్కడీ స్త్రీకి స్వేచ్ఛ. స్త్రీ పుట్టిన దగ్గర నుండి మరణం వరకు ఇతరుల కోసం తన కోరికలన్నీ చంపుకొని బతకాలి. ఇందులో మళ్లీ కట్టుబాట్లు, సంస్కతీ, సంప్రదాయం ఇవ్వన్నీ మహిళలకే ఎక్కువ వర్తిస్తాయి. అసలు చరిత్రను పరిశీలిస్తే స్త్రీని విద్యకు, వికాసానికి, ఉత్పత్తి ఫలితానికి దూరం చేశా యి. వారిని పరాధీనులుగాను, బానిసలుగాను మార్చాయి. మానసికం గా పురుషునికి దాస్యం చేసే భావజాలాన్ని అలవర్చాయి. లింగ వివక్ష కూడా ప్రధానంగా ఉంది. ఇక్కడ స్త్రీలు పేదరికంతోపాటు పురుష పెత్త నానికీ గురవుతున్నారు. అన్ని మతాలు, పురాణాలు, నీతులు, కట్టుబా ట్లు స్త్రీ స్వేచ్ఛను నిరాకరించి, వారికి సంకెళ్లు వేసేవిగా ఉన్నాయి. స్త్రీ మాటలు, చేష్టలు ఎలా ఉండాలో ముందుగానే స్క్రిప్ట్ రాయబడి ఆ విధంగానే ఆమె ప్రతి కదలిక ఉండేలా చేసింది.సమాజం ఆమెకు స్థిరీకరించిన గుణాలను రోమాంటిసైజ్ చేసి ఆ నమూనాలోనే ఆమెను చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఆ గోడలు పగలగొట్టుకొని వచ్చిన స్త్రీ పాత్రలు దుష్ట పాత్రలుగా చూపించారు. ఇప్పటికీ మనం టివి సీరియల్స్‌లో చూస్తే స్త్రీలను నెగెటివ్‌గానే ఎక్కువ గా చూపిస్తున్నారు. అంటే అప్పటి పురాణ కథ నుండి నేటి సీరియల్స్ వరకు స్త్రీని నెగెటివ్ చేసి చూపించారు. ఆఖరికి స్త్రీని నెగెటివ్ సింబల్ తో పోల్చడం చూస్తే నేటి స్త్రీ ఏ పరిస్థితిలో ఉందో గమనించండి. స్త్రీని ఒక శంగార వస్తువు గా చేశారు. ఇప్పటికే స్త్రీ శరీరం వాడుకొనే ఎన్నో ప్రొడక్ట్స్ యాడ్స్ రూ పంలో వస్తున్నాయి. ఆఖరికి పురుషులు ఉపయో గించే వస్తువుల ప్ర మోషన్స్ కూడా స్త్రీల అర్ధనగ ప్రదర్శనతోనే జరుగు తున్నాయి. ఏదిఏ మైనా నేటికి స్త్రీ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య రక్షణ అడుగడు గునా బలత్కారాలకు గురౌతున్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా స్త్రీని కాపాడలేకపోతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే, పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులే పోలీసులకు అప్పచెప్పాలి. తప్పు చేసిన ఎవరి బిడ్డ అయినా శిక్షకు అర్హులే అని తెలుసుకోవాలి. మాతత్వం బిడ్డ తప్పును సమర్ధిస్తే అది ఎప్పటికీ సమాజానికి మేలుచేకూర్చదు.
- నిజాగ్ని
సెల్ : 9700747280