Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు ఈ కేంద్రాలు చాలా దూరంలో ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని నివారించలేకపో తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో రైతుల యొక్క విలువైన పశుగ్రాసాలకు అగ్నిప్రమాదం సంభవిస్తే పూర్తిగా దగ్దం అయిపోతున్నాయి. కానీ వాటిని నివారించలేక పోతున్నారు. అందుకు కారణం ఈ అగ్నిమాపక కేంద్రాలు పల్లెప్రాంతాలకు చాలా దూరంలో ఉండటమే. మండల కేంద్రాలలో అగ్నిమాపక కేంద్రాలు ఉంటే పూర్తినష్టం జరగకుండా నివారించటానికి అవకాశాలు ఉంటాయి. పాలకులు ఎన్నికల ముందు అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అని చెప్పే మాటలు నీటిమూటలు అవుతున్నాయి. ప్రభుత్వం అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయడంలో అలసత్వం ఎందుకు ప్రదర్శిస్తుందో అర్థం కావడం లేదు.
- షేక్ అస్లాం షరీఫ్,
శాంతినగర్, జోగులాంబ బద్వాల్జిల్లా.