Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసెంబ్లీ మీడియా పాయింట్.. పొద్దుగాల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే దగ్గర నుంచి ప్రమాణ స్వీకారం అయిపోయిన దాక ఎలక్ట్రానిక్ మీడియా వాళ్లు వీడియోలు పెట్టుకుని..మైకులు పట్టుకుని, ప్రింటు మీడియా వాళ్లు బుక్కులు పట్టుకుని పడిగాపులు గాశారు. ప్రమాణ స్వీకారం అయి పోయిన తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా కార్లెక్కి పలాయనం చిత్తగించారు. ఇగొస్తరేమో... అగొస్తరేమోనని కండ్లల్ల ఒత్తులేసుకుని ఎదురు చూసిన మీడియా ప్రతినిధులు ఆకలితో కండ్లు తేలేశారు. అదే క్రమంలో ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి నిధి ఏందిర బై ఈ ఎదురుచూపలు అనగా... మరో మీడియా మిత్రుడు కల్పించుకుని ఏహె అంతా బంగారు తెలంగాణాయే. ఈడ మాట్లాడనీకి ఇంకే ముంటది? అని అనగానే అక్కడున్న వాళ్లంతా గొల్లుమన్నారు.
- అచ్చిన ప్రశాంత్