Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏ చరిత్ర చూసినా ఏము న్నది గర్వకారణం'' అన్నా రు మహాకవి. అలా.. ఈ ప్రస్తు త కాలంలో ఏ దేశమైనా, ఏప్రాంతమై నా, ఏ నాగరికత అయినా ఎవరి జీవ న విధానాలను పరిశీలించినా ఇంచు మించు ఒకటిగానే ఉన్నాయి. హత్య లు, దాడులు, వేధింపులు.. వెరసి అంతటా నేర ప్రవృత్తులు. ఎందు కిలా అవుతుంది సమాజం? యు నైటెడ్ స్టేట్స్‌కి చెందిన ఆనా అన స్థాసియా అనే ఆవిడ భర్తకు తెలియకుండా వేరే రిలేష న్లో ఉండి, తన కూతురు అతని బా రుఫ్రెండ్తో కలిసి భర్తను హత్య చేయించింది. కూతురినే చం పిన నోయిడా కథ మనం వినే ఉన్నా ము. ప్రముఖ వ్యాపారవేత్త, విద్యా ధికుడు జయరామ్ హత్య రో జుకో మలుపు తిరుగుతోంది. మేన కోడ లు శిఖాచౌదరి ఆవిడ బారు ఫ్రెం డ్ రాకేశ్ మరొకరు.. మరొకరు...!
కాచిగూడకు చెందిన 20 ఏం డ్ల యువకుడు తనను ప్రేమించడం లేదని కొబ్బరి బోండాలు నరికే కత్తితో ఒక అమ్మాయిని నరికేశాడు. వరంగల్‌లో మరొ కడు ఇదే కారణంతో ఏకంగా యాసిడ్ పోసి, ఆపై పెట్రోల్ కూడా పోసి అమ్మాయిని తగులబెట్టాడు. ఒక ట్రాఫిక్ హోం గార్డ్ తన బావమరిదితో కలిసి ఒక వెయిటర్ని అడవులలోకి తీసికెళ్లి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అతని భార్యతో గల అక్రమ సంబంధమే దీనికి కారణం! నల్గొండ జిల్లాలోని దొరెపల్లి గ్రామంలో లక్ష్మణ్, ప్రవీణ్ అనే యువకులు ఒక అమ్మాయి కోసం గొడవపడి కత్తులతో పొడుచుకున్నారు. వీళ్ళిద్దరూ ఇంటర్ విద్యార్థులవడం గమనార్హం! ఇవి ఈ వా రంలోని వార్తలు మచ్చుకు నాలుగు! ఇలాంటివి ప్రతి రోజూ వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. ఒక పక్క ఆధు నికత, సాంకేతికత, నాగరికత పెరుగుతుంటే.. మరో పక్క నేరప్రవృత్తి హద్దులు దాటుతోంది. ఇందులో మైనర్ నుంచి వృద్ధుల వరకు ఎవ్వరికీ మినహాయింపులేదు. నిరక్ష రాస్యులు, విద్యాధికులు, ధనికులు, పేదలు, స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా నేరప్రవృత్తిలో మునిగిపోతున్నారు! అందరిలోనూ ఈ ఆటవిక ప్రవృత్తి పెచ్చరిల్లుతోంది. ఇందుకు కారణం ఏమి టి? సమాజాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్న ఈ పరిణా మాలకు బాధ్యత ఎవరిది? ఇది ఆలోచించాల్సిన విషయం. ఒక భార్య భర్తను హత్య చేయిస్తోంది. ఒక 17ఏండ్ల పిల్ల వాడు తనను ప్రేమించడంలేదని ఒక అమ్మాయిని నరు కుతున్నాడు. ఇంకొకరు అక్రమ సంబంధం కోసం హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పైగా వీళ్లంతా 'నేనే చంపా ను' అని నిర్భయంగా చెబుతున్నారు. ఎంత ఉన్మాదం!?
సైన్స్ ప్రకారం మనిషి వ్యక్తిత్వ వికాసం రెండింటి పైన ఆధారపడి ఉంటుంది. 1.అనువంశికత 2.పరిసరాల ప్రభావం. ఈ రెండింటినీ ఆధారం చేసుకుని విశ్లేషిస్తే... అనువంశికతకన్నా పరి సరాల ప్రభావం వలన నేరప్రవృత్తకి గురవుతున్నవారే ఎక్కువ! మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణల ప్రకారంగా... కుటుంబ అనుబంధాల్లో లోపం, ఒంటరితనం, షేరింగ్ అండ్ కేరింగ్ లేకపోవడం కూడా మనిషిలో హిం సావాదాన్ని పెంపొందిస్తోంది. వీరి ఆలోచనా విధానంలోనే లోపం ఉంటుంది. తాముచేసిందే కరెక్ట్ అనే భావం ఉం టుంది. అందుకే అమ్మాయిలను చంపి, హత్యచేసి, రేప్ చేసి కూడా కించిత్ సిగ్గు, బిడియం, భయం లేకుండా వ్యవహరిస్తున్నారు. వీరికి క్షమా భావనలు ఉండవు. మనిషి మెదడులో 'ఆర్బిటల్ కార్టెక్స్' అనే పదార్థం ఉంటుంది. ఇది ప్రేమ భావోద్వేగంవంటి సున్నిత భావనలను ప్రేరేపిస్తుంది. దీని పనితనం తగ్గితేObsessive Coupulsive Disorder (ODC)అనే మానసిక వ్యాధి తలెత్తుతుంది. దీనితో మేజర్ డిప్రెషన్, చిరాకు డిసార్డర్స్ ఏర్పడుతాయి. న్యూనతా భావం లేదా అహంభావం ఏర్పడి అకా రణ ద్వేషం, కోపం తలెత్తు తాయి. అదే క్రమేణా తీవ్రమైన నేరప్రవృత్తికి దారితీస్తోంది.
కుటుంబ వ్యవస్థలో సరైన ఆదరణ లభించని వాళ్లు కూడా బయటి సమాజంలో ప్రేమను, తాము కోల్పోయిన భద్రతను వె తుక్కోవడానికి ప్రయత్నిస్తారు. అది అక్కడ కూడా లోపిస్తే ఓసీడీ ఏర్పడి చంపడానికైనా, చావడానికైనా సిద్ధపడు తుంటారు. విపరీతమైన అహంభావం కూడా ఫెయిల్యూర్‌కు మరో లక్షణం. పదే పదే ఫెయిల్యూర్స్ ఎదురయ్యే వ్యక్తికి జీవితంపైన నిర్లక్ష్యం ఏర్పడుతుంది. అది ఒక్కోసారి తెలియకుండాని అకారణమైన పగగా కూడా మారుతుంది. దీనికి కారణం కూడా 'ప్రేమరాహిత్యమే'.
కుటుంబ వ్యవస్థ సమజానికి పట్టుకొమ్మ. ఇక్కడి నుంచే ఏదైనా సాధ్యం Everything Begins at Hom. పిల్లలు పుట్టాక భార్యాభర్తలు తల్లిదండ్రులుగా మారిపోవాలి. వారి ప్రతి కదలికను గమనిస్తూ సరైన ఆదరణను, మార్గదర్శనాన్ని అం దించాలి. విలాసాలకు అవసరాలకు మధ్య తేడా తెలియ జేయగలిగితే చాలు చాలా నేరాలు ఆగిపోతాయంటే అతిశ యోక్తి కాదు. విలాసవంతమైన జీవన విధానానికి అలవాటు పడి ఆ అవసరాలకోసం దిగజారుతున్న నాగరికులను కూడా మనం చూస్తున్నాం. మత్తు, మందు, మగువ స్టేటస్ సింబ ల్స్‌గా మారిన నేటి సమాజంలో వాటిని అందుకోవడానికి హత్యలకు కూడా జంకని ఉదంతాలు ఇందుకు తార్కాణం. జీవితం పట్ల నిర్లక్ష్యం, హద్దుల్లేని వ్యామోహాలు మనిషిని పత నం చేస్తున్నాయి. ప్రేమ కోసం, డబ్బు కోసం, హోదా కోసం, కులం కోసం, మతం కోసం హత్యలు జరుగుతున్నాయి. ఇది ఆధునిక సమాజమా? ఆటవిక ప్రపంచమా?! ఆటవికత అనుకోవడానికి కూడా వీలు లేదు. ఆకలివేసినపుడే మృగం వేటాడుతుంది. కానీ మానవమృగాల ఆకలికి అంతముందా?
వీటి పరిష్కారానికి ప్రయత్నాలు ప్రారంభం కావాల్సింది మొదట కుటుంబం నుంచే. కుటుంబ వ్యవస్థ పటిష్టం కావాలి. అనుబంధాలు వికసించాలి. అరమరిక లులేని అభిప్రాయాలకు అవకాశముండాలి. మద్దతునిచ్చే మనుషుల కోసం బయటకు పోకుండా కుటుంబమే ఆలంబ న కావాలి. పసితనం నుంచే పిల్లలకు జీవితం విలువ, మనుషుల విలువ తెలియజేయాలి. మానవత్వపు మధురి మలను బిడ్డలకు నేర్పాలి. ఇది పెద్దల ద్వారా, ఉపాధ్యాయుల ద్వారా జరగాలి. విద్యతోపాటే విలువలకు ప్రాధాన్యతని వ్వాలి. మన రాజకీయాల్లో, చట్టాల్లో కూడా ఇందుకవస రమైన మార్పులు రావాలి. వ్యవస్థలన్నిటికీ మానవ శ్రేయస్సే లక్ష్యం కావాలి. జ్యూవెనైల్ నేరాలు తగ్గాలంటే... తిరిగి మానవ జీవితంలో ప్రశాంతత నెలకొనాలంటే ముందు కుటుంబం ఆపైన సమాజం మేల్కొనాలి. అభివృద్ధి చెందుతుందని చెప్పుకుంటు న్న మన నాగరికత మానవత దిశగా పయనించాలి.
- రమాదేవి కులకర్ణి
సెల్ : 8985613123