Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సారూ మీరూ ఏ నెట్వర్క్ వాడుతున్నారు అని ఆతృతగా అడిగాడు ఒక రాజకీయ నాయకుడు. చాలా కాలంగా బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అని బదులిచ్చాను. అందుకేనండీ..! కమ్యూనిస్టులు మారరు. మూసపద్ధతుల్లోనే పోతారు. అందుకే సీట్లు లేవు. ఓట్లు లేవు అని దెప్పిపొడిచారు. పాతవే ఉండాలంటారు. కొత్తవి వద్దంటారు అంటూనే బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఎక్కడొస్తుందండీ... ఫోన్లు కలువవ్, ఫోన్లు చేస్తే కట్ అవుతాయి. నేను కూడా ఉపయోగించి బేజారెత్తిపోయి ఐడియా, ఎయిర్టెల్, ఇటీవల జియో కూడా వాడుతున్నాను. ఎక్కడెకెళ్లినా నిశ్చింతగా మాట్లాడుకోవచ్చు. ఎంతసేపు మాట్లాడినా ఎలాంటి ఇబ్బందీరాదు. అంటూ వాటి గురించి గొప్పగా చెబుతూనే ఉన్నారు. అంటే ప్రయివేట్ కంపెనీలు చెబుతున్న వాదనలు, చేస్తున్న ప్రచారం ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయో ఈ చిన్న ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ కనెక్టివిటీని చంపేయడానికి అనేక కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే బీఎస్ఎన్ఎల్పై దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రయివేట్ నెట్వర్క్ అవసరం లేకున్నా వాడుతున్నారు. చాలా మంది వినియోగదారులు అవసరం కోసం బీఎస్ఎన్ఎల్ వాడుతున్నారు.
- గుడిగ రఘు