Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కూరగాయలు కొందామని గురువారం సంతకు రాణీ వెళ్లింది. తనకు కావాల్సిన తాజా కూరగాయలు, లేత ఆకు కూరలు ఎక్కడ దొరుకుతాయోనని మార్కెట్ మొత్తం కలియతిరిగింది. ఒకటి రెండు చోట్ల కూరగాయలు ఏరి చూసింది. నచ్చలేదు. మరొకచోట నచ్చడంతో ఏరుకుందామని కూరగాయలపై చేయి పెట్టింది. 'వామ్మో..! ఇంత మంచి కూరగాయలు ఏరకుంటావా? ఎన్ని కావాలో చెప్పు ఇస్తాను..' అంటూ తక్కెడ తీసిండు.. కూరగాయలమ్మే మల్లయ్య ఎందుకమ్మా..! కూరగాయలు కొననీకే గింతఘనం ఆలోచిస్తున్నవ్...మన ముఖ్యమంత్రి కేసీఆర్ చూడు. కాంగ్రెసోళ్లు అమ్ముతుంటే, కేసీఆర్ టక్కున కొంటున్నడు. ఎమ్మెల్యేలు ఎలాంటి వారు. మంచి గుణగణాలు ఉన్నాయా? వారికి ఎలాంటి చరిత్ర ఉందోనని చూడకుండానే కొంటున్నడు. 'మేము మాత్రం పుచ్చులూ బుర్రలూ అమ్మం. రోజు వ్యాపారం చేసేటోళ్లం...మోసం చేస్తామా?' 'కేసీఆర్ అంటే ఏ పార్టీలో గెలిచినా సరే తన మందబలం పెంచుకోవాలని ఏవి పడితే గవీ కొంటున్నడు. ఎమ్మెల్యేలను కొననీకే ఆయనకు బుద్ధి లేకపోయినా.. మాకు ఉంది. ఎట్లాబడితే అట్లా కూరగాయలు అమ్మం. తల్లీ..!తాజాగుంటేనే తీస్కుపో..'
- గుడిగ రఘు