Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత పెద్దదో, ఎంతెంత విస్తరణగలదో, ఎన్ని పరిణామాలతో ప్రయాణిస్తుందో అంతకంటే పెద్దదీ, లోతైనదీ మార్క్స్ రాసిన పెట్టుబడి. ఎందుకంటే పెట్టుబడిదారీ వ్యవస్థలోని గుట్టునంతా విప్పి, మన కండ్ల ముందు పెట్టే ప్రయత్నం చేశాడు మార్క్స్. అందుకు తన జీవితాన్నంతా వెచ్చించాడు. ఎన్నో సంక్ష్లిష్టాంశాలను చర్చించి విషదపరిచాడు.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ము సురుకుంటున్నది. మన దేశంలోనూ ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రజలపైన, పెట్టుబడిదారులపైన పడుతు న్నది. సరుకుల ఉత్పత్తిని నిలిపివేసి, ఉద్యోగులనూ తొలగిస్తున్నది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నవి? వీ టికి కారణాలను ఎప్పుడో నూటాయాబై ఏండ్ల క్రితమే మార్క్స్ వివరించాడు. ఇప్పుడు ప్రభుత్వాలు, రాజకీ య నాయకులు చెబుతున్న కారణాలు కానీ, వాటికి వాళ్లు పరిష్కారాలు కానీ పూర్తిగా అసంబద్ధమైనవీ, ఉపశమనాలు మాత్రమేననీ.. అసలు కారణం ఉత్పత్తి విధానంలో ఉందనీ తేటతెల్లం చేశాడు. అందుకే మార్క్స్ చిరంజీవి.
మార్క్స్ పుట్టి రెండు వందల ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ కాలం ద్వారా పెట్టుబడిలోని కొన్ని ముఖ్యమైన, సాధారణమైన విషయాలను పరిచయం చేసే ప్రయత్నం చేశాను. వర్తమాన తరం పెట్టుబడిని చదవాల్సిన, అధ్యయనం చేయవలసిన అవసరం చాలా ఉందన్న ఉద్దేశంతో చదవడానికి ప్రేరణ కల్పించే ప్రయత్నం ఈ పరిచయాల ద్వారా చేశాను.
అయితే అర్థశాస్త్రం అంతా తేలిగ్గా అర్థమయ్యేది కాదు. అర్థశాస్త్రంలోని అసలు రహస్యాలను ఎత్తి చూ పడం మరీ కష్టం కదా! అయితే వాటిని అర్థం చేసుకో కుండా, అవగాహన చేసుకోకుండా మన జీవితాలను, జీవన సమూహాలనూ అర్థం చేసుకోలేము. అర్థం చే సుకున్నామని ఎవరన్నా అనుకుంటే అది తలక్రిందుల సమాజమే అవుతుంది. ఎన్ని పరిచయాలు చదివిన ప్పటికీ క్యాపిటల్ మూల రచన చదవటానికి ప్రత్యా మ్నాయం లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థను మొత్తం చూసి వివరించడానికి ప్రయత్నం చేసిన ఏకైక రచన క్యాపిటల్ మాత్రమే. వేలాది పేజీల సునిశిత విశ్లేషణా క్రమంలో మార్క్స్ ప్రతిభ వెలుగులీనుతూ ఉంటుం ది. మార్క్స్‌ను తీవ్రంగా విమర్శించిన వారు కూడా ఆయనతో విభేదిస్తూనే ఆయన శక్తి సామర్థ్యాలను అంగీకరించకతప్పలేదు.
మార్క్స్ ప్రాతిపదికలలో అత్యంత ముఖ్యమైనది, మౌలికమైనది సరుకు అనే భావన. మనం ఒక వారెన్వెల్ట్ -సరుకుల ప్రపంచంలో జీవిస్తున్నాం అని ఆయన అంటాడు. మార్క్స్‌ను విలువ సిద్ధాంతకర్తగా పరిచయం చేస్తున్నప్పటికీ తన దృక్పథాన్ని సరుకు సిద్ధాంతంగా నిర్వచించడం సరైనదని ఆయన చివరి రోజుల్లో రాశారు.
మార్క్స్ దృష్టిలో సరుకు అంటే ఉపయోగ విలు వకూ, విలువకూ వైరుధ్యపూరిత ఐక్యత గనుక విలు వ సిద్ధాంతానికీ సరుకు సిద్ధాంతానికీ ఇలా తేడా చూ డటం స్వల్ప విషయమని అనిపించవచ్చు. కానీ వాస్త వంలో ఈ విభజన చాలా కీలకమైనది. మార్క్స్ చిత్రి ంచిన పద్ధతిలో విలువ అనేది వినియోగానికి అవరో ధం. అది శ్రమ ఉత్పత్తులు మన అందుబాటులోకి రాకుండా అడ్డుకునే సామాజిక శక్తి క్షేత్రం వంటిది. ఈ క్షేత్రాన్ని ఛేదించి వెళ్లగలిగినదీ, మనుషులకు అవ సరమైన వాటిని వారి అందుబాటులోకి తెచ్చేదీ డబ్బు మాత్రమే. అయితే డబ్బు కూడా ఒక సరుకే. నిజానికి డబ్బు అనేది మిగిలిన అన్నిటికీ సార్వత్రికంగా సమా నమైన సరుకు. అంటే ఆ రకంగా అది అంతిమ స రుకు. అది లేకపోతే మనకు ఇంకేమీ ఉండదు. పెట్టు బడిదారీ వ్యవస్థలో, ఉత్పత్తులను అమ్మకం అయ్యే వరకూ వినియోగించడానికి వీలులేదు. అంటే మన దగ్గర డబ్బు లేకపోతే, ఉత్పత్తులు ఎంత పుష్కలంగా ఉన్నా సరే మనకు ప్రతిదీ నిరాకరించబడుతుంది.
లాభాపేక్ష అనేది మానవ అవసరాల సంతృప్తి మీద విధించిన పరిమితుల గురించి నిశితంగా అవగాహన చేసుకున్న మార్క్స్.. డబ్బులేని, సరుకులే ని, విలువ లేని సమాజం ఉండాలని ప్రబోధించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సమాజంలో మనుషు లు తాము తయారు చేసిన వాటినీ, తమ నిర్ణయాధి కారాన్నీ యజమానులూ, లాభాలూ లేకుండా పంచు కుంటారు. ఇది సాధ్యమే అంటాడు మార్క్స్. సహకా రం, పంచుకోవడం అనేవే సుస్థిరమైనవనీ, సరుకుల ఉత్పత్తి, డబ్బు వ్యవస్థ సుస్థిరమైనవి కావనీ మార్క్స్ చెబుతాడు. ఎందుకు మార్క్స్ ఇంత గాఢంగా విశ్వసి ంచాడో తెలవాలంటే ఆయన వివరించిన సరుకు, డబ్బు, విలువ మొదలైన విషయాలు అర్థం చేసుకోగ లగాలి. సరుకు చాలా మహత్తు గలది. దాన్ని చిత్ర మైన ఫీట్లను అన్నింటినీ మనకు చూపించాడాయన. అందుకనే మొదటి అంశంగా సరుకు విశ్వరూపాన్నే వివరించాడు మార్క్స్.
ఇక ఇప్పటి వరకు ఇరువైమూడు వ్యాసాలలో ప రిచయం చేసిన అంశాలు ఒక వరుస క్రమంలో లేవు. కొంత ఆసక్తి, శ్రద్ధ పెంచడం కోసం ప్రేరణ కలిగిం చడం కోసం పాపులర్ విషయాలను ముందుగా చ ర్చించాం. ఈ సిరీస్‌లో ముందుగా చర్చించింది డబ్బు గురించి. ''1844 ఆర్థిక తాత్విక రాతప్రతులు''లో మార్క్స్ డబ్బు గురించి చాలా అద్భుతంగా వర్ణించా డు. డబ్బుకుండే లక్షణాలలో ఒకటి అది మానవ స హజమైన మానవీయ లక్షణాలన్నింటినీ వ్యతిరేకమైన లక్షణాలుగా మార్చగలదు. వస్తువుల తలకిందుల రూపం దాని స్వభావం. మానవుల సహజ గుణాల ను తలకిందులు చేసేది డబ్బు. అన్యధీకరణ చెందిన మానవ జాతి సారం డబ్బు అనే విషయాలను చాలా సోదాహరణంగా వివరించాడు మార్క్స్.
ఇక సొంత ఆస్తి గురించిన విశ్లేషణలో పరాయీ కృతమైన శ్రమనే సొంత ఆస్తి అంటాడు మార్క్స్. అనే కమంది శ్రామికులు పని చేసి సృష్టించిన సంపదను ఒక్కరో, ఇద్దరో సొంతం చేసుకోవడం ద్వారా ఏర్పడి నదే సొంత ఆస్తి అని ఆ ఆస్థిని గురించి పరిచయం చేసాను. మనిషి పరాయీకరణ గురించిన విషయా లను శ్రమ పరాయిదిగా మారిపోతున్న క్రమంలో మ నిషి అన్యధీకరణకు గురవుతున్న పరిస్థితులను, శ్రమ తత్వాన్ని, సర్వ సంపదలకు శ్రమమూలమన్న విషయాన్ని శ్రమను గురించిన చర్చల్లో వివరించాను. పెట్టుబడి ఎలా తయారవుతుందో ఒక చర్చలో మ నం చూస్తాం. డబ్బు అనేది పుట్టుకతోనే ఒక చెంప మీద రక్తపు మరకతో జన్మిస్తే పెట్టుబడి అనేది నఖ శిఖ పర్యంతం ప్రతిరోమకూపం నుండి రక్తమూ, చీ మూ, మురికీ కారుతూ జన్మిస్తుంది అంటాడు మా ర్క్స్. అలాగే మార్క్స్ పెట్టుబడిలోని చాలా కీలకాంశం అదనపు విలువ దోపిడీని వివరించడం, కార్మికునికి వేతనం చెల్లించేందుకు పెట్టుబడిదారులు వేసే లెక్క లు, వ్యవసాయంలో పెట్టుబడిదారీ లక్షణాలు, దోపిడీ తీరు, భూమికి చెల్లించే కౌలు, వడ్డీ చెల్లించడంలోను న్న అన్యాయం గురించిన చర్చ చేయడం జరిగింది.
పెట్టుబడిదారీ లక్షణమైన నిరుద్యోగం గురించీ, లాభాల కోసం ఇష్టం వచ్చినట్టు సరుకుల ఉత్పత్తి పె రగటం, కొనటానికి ప్రజలకు స్థోమత లేక ఆర్థిక సం క్షోభాలు తలెత్తడం ఈ వ్యవస్థలో బ్యాంకులు నిర్వహి స్తున్న పాత్ర గురించి, స్టాక్ మార్కెట్ల మాయాజాలం గురించి, ద్రవ్య పెట్టుబడి విస్తరణ విషయాలనూ, క్రోనీ క్యాపిటలిజం కొత్త ముఖాన్ని వివరించడం మొ దలైన అనేక ముఖ్య విషయాలను కొంత పరిచయం చేయడం జరిగింది. ఇవి సమగ్రమూ కాదు. సంపూర్ణ మూ కాదు. వీటి నుండి మరింత అధ్యయనానికి ముందుకు పోవాలన్నదే ఈ వ్యాసాల ఉద్దేశ్యం.
గత ఆరు నెలలుగా సాగుతున్న ఈ ఆర్థిక విష యాల చర్చను ముగించి, ఇకపై కొన్ని ముఖ్యమైన మార్క్సిస్టు తాత్విక విషయాలను చర్చించాలని తలపె ట్టాను. తాత్విక విషయాలూ కొంత క్లిష్టమైనవిగానే ఉంటాయి. అయినా వాటిని కూడా మనకు తెలిసిన భాషలో, తెలిసిన అంశాలతో చర్చించే ప్రయత్నం చే స్తాను. ఇవికూడా ప్రాథమిక పరిచయాలుగానే ఉం టాయి. నేటి వర్తమాన కాలానికి చాలా అవసరమైన దిగా ఆవశ్యకమైనదిగా భావించి తత్వశాస్త్ర చర్చకు పూనుకుంటున్నాను. పాఠకులు మార్క్స్ మార్గంలో గత విషయాలపై చర్చకు స్పందించిన విధంగానే తాత్విక విషయాలకూ స్పందిస్తారని ఆశిస్తున్నాను.
- ఆనందాచారి
సెల్ : 9948787660