Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమికీ ఆకాశానికీ మధ్య
నిజాల నిచ్చెన వేసి
నక్షత్రాల వెలుగులో
లోకాన్ని పరికించినపుడు
మార్క్స్కు కనిపించిందంతా
వర్గపోరాటమే...!
అప్పుడు..
నెలవంక సాక్షిగా
చరిత్ర చీకటి కాగితాలపై
సూర్యోదయాన్ని లిఖించాడు మార్క్స్..!
తలకిందుల పప్రంచాన్ని
నిటారుగా నిలబెట్టి
హేతువు గీటురాయిపై
సత్యానికి పట్టం కట్టాడు మార్క్స్..!
- స్ఫూర్తి,
9490098694