Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లోకమంతా ఒకవైపు అమెరికా ఇంకోవైపు. కరోనా వైరస్‌తో అల్లాడుతున్న అమెరికాకు ట్రంప్ పరిపాలన శాపమే అయింది. అగ్రరాజ్యం కాస్త దాదాపు లక్షా 10వేల ప్రాణాలను వైరస్‌కు ఫణంగా పెట్టింది. సందట్లో సడేమియాలా ఒకవైపు కరోనా ఆదేశంలో స్వైరవిహారం చేస్తుండగా, మరోవైపు జాతివివక్ష కోరలు చాచడం ఆందోళన కలిగించేదే. జార్జ్ ఫ్లాయిడ్ హత్య నేపథ్యంలో చోటుచేసుకున్న నల్లజాతీయుల ''ఐ కాంట్ బ్రీత్'' పోరాటానికి ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం వ్యక్తమవుతున్నది. కరోనాను ఎదుర్కోకుండా పెట్టు బడిదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చిన ఆ దేశ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తన పాపాలను చైనాపై రుద్దేప్రయత్నంలో ఉండటం ఆశ్చర్యకరం. ఐ కాంట్ బ్రీత్ ఉద్యమానికి పోలీసులు సైతం మద్ధతివ్వడం అక్కడి జాత్యాహంకార వైషమ్యాలను రూఢ చేస్తున్నది. అమెరికాలో జాతీ వివక్ష మూలంగా స్వేచ్ఛనో, ప్రాణాన్నో కోల్పోవాల్సి వస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ట్రంప్ వైఖరి నవ్విపోదురు గాక నాకేంటి...అనేలాగుండటం గమనార్హం.
-బి.బసవపున్నయ్య