Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
భారతీయ స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులకు మగ్గం వర్క్, లేడీస్ టైలరింగ్, కాస్ట్యూమ్ తయారీ, ఆభరణాల తయా రీలలో ఉచిత శిక్షణనిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ ఎం.మాధురి తెలిపారు. 30 రోజుల పాటు మగ్గం వర్క్, లేడీస్ టైలరింగ్, 13 రోజుల పాటు కాస్ట్యూమ్ తయారీ, ఆభరణాల తయారీలలో శిక్షణతో పాటు ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. శిక్షణ అనంతరం యోగ్యతా సర్టిఫికెట్ ఇస్తారని తెలిపారు. వరంగల్ అర్బన్, రూరల్, జయశంకర్భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూ బాబాద్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు, 10వ తరగతి ఆపై విద్యార్హత కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 4 పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, రేషన్, ఆధార్‌కార్డు, విద్యార్హత జిరాక్స్ కాపీలు తీసుకొని భారతీయ స్టేట్ బ్యాంక్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, సంస్కృతి విహార్, టీటీడీసీ, హసన్‌పర్తి, వరంగల్ జిల్లా 506371 చిరు నామాలో జనవరి 31వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకో వాలని సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి శిక్షణ తరగ తులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9704056522, 9849307873, 95026 21342, 6281260878లో సంప్రదించాలని సూచించారు.