Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండల పరిధి పుల్లూరు గ్రామంలో మీ సేవా కేంద్రం ఏర్పాటుకు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవాలని తహసీల్దార్ రఫీయుద్దిన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు స్థానికుడై, 18-35 సంవత్సరాల వయస్సు కలిగి డిగ్రీ ఆపై విద్యార్హత కలిగి కంప్యూటర్ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 27వతేదీలోపు www.mahabubabad.telangana.gov.in జిల్లా వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.