Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామటౌన్
జనగామ జిల్లా కిక్‌బాక్సింగ్ జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీగా పెసరు సారయ్య, ఓరుగంటి సంతోష్ కుమార్‌ను ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లో 31 జిల్లాల కిక్‌బాక్సింగ్ కోచ్‌ల ఆధ్వర్యంలో బుధవారం కిక్‌బాక్సింగ్ తెలంగాణ రాష్ట్ర సమావేశం నిర్వహించారు. నాలుగేండ్లుగా ఉమ్మడి పూర్వ వరంగల్ జిల్లాలో కిక్‌బాక్సింగ్ కోచ్‌లుగా రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయిలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలబడడంలో విశిష్ట కృషి చేసిన వారి సేవలను గుర్తించి నూతనంగా ఏర్పడ్డ జనగామ జిల్లాకు స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన సారయ్యను ప్రెసిడెంట్‌గా జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్‌ను జనరల్ సెక్రటరీగా నియమించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ రామాంజనేయులు, జనరల్ సెక్రటరీ ఎం మహిపాల్ సంతోష్, సారయ్యలను అభినందించారు. ఈ సందర్భంగా సారయ్య, సంతోష్ మాట్లాడుతూ జనగామ జిల్లాకు కిక్‌బాక్సింగ్‌లో రాష్ట్రస్థాయి గుర్తింపు తీసుకొచ్చేవిధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిక్‌బాక్సింగ్ కోచ్‌లు మామిడాల శ్రీనివాస్, తిరుపతి, బండారు సంతోష్, కిషన్, తదితరులు వారిని అభినంధించారు.