Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినాయక చవితినాడు గణనాథునికి అనేక రకాల పత్రాలతో (ఆకుల) పూజ చేస్తాం. ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులు ఇంట్లో ఉంచుతారు. దీంతో పత్రాల నుండి, అలాగే కొత్తమట్టితో తయారుచేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడుతాయి. ఆ కుటుంబంలోని అందరికీి ఆయురారోగ్యాలు పంచుతుందని నానుడి. నేటి వైద్యులు కూడా అదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. నేడు వినాయకచవితితో అర్బన్, రూరల్, జనగామ జిల్లాలతో పాటు నర్సంపేట, పరకాల, ఆయా మండలాల్లో మంటపాలు సిద్ధమయ్యాయి. కొద్ది గంటల్లో విగ్రహాలను నిర్వాహకులు ప్రతిష్టంచనున్నారు. అయితే ప్రత్యేక పూజల్లో వాడే 21 రకాల పత్రాలు మానవ ఆరోగ్యానికి దోహద పడతాయి. ఆవిశేషాలు తెలుసుకుందామా....
నవతెలంగాణ-వరంగల్
వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడిపో యిన 48గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తా యి. అంతేకాక వాటిని 9రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలు వడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములు, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి. పిల్లలకు పత్రి సేకరణ వల్ల విజ్ఞానం, వినోదం, పర్యా వరణం పట్ల స్నేహభావం కలుగుతాయి. విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితి. ఒక్కొక్క ఆకులో ఒక్కో ఔషధ గుణముంటుంది.
1. మాచీపత్రం (మాచిపత్రి)
ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబం ధమైన వ్యాధులు నివారించడానికి ఉపయో గపడుతుంది.
2. బహతీ పత్రం(వాకుడాకు)
ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులు, నేత్ర వ్యాధుల్ని నయం చేయడానికి, దంత ధావనానికి దోహదపడుతుంది.
3. బిల్వ పత్రం( మారేడు)
ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధు మేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గం ధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
4. దూర్వాయుగ్మం(గరిక)
ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, మొలల నివారణకు ఉపయోగపడుతుంది.
5. దత్తూర పత్రం(ఉమ్మెత్త)
ఇది సెగ గడ్డలు, స్త న వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషం కావున కాస్తంత జాగ్రత్తగా వాడుకోవాలి.
6. బదరీ పత్రం(రేగు)
జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపుదలకు సహాయపడుతుంది.
7. ఆపామార్గ పత్రం(ఉత్తరేణి)
దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాలలో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
8. తులసీ పత్రం(తులసీ)
ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ సౌంద ర్యం, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.
9. చూత పత్రం( మామిడాకు)
ఇది రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంటిలోని క్రిమి కీటకాల నివారణకు దోహ దపడుతుంది.
10. కరవీర పత్రం( గన్నేరు)
ఇది కణుతులు, తేలు కాటు- విష కీటకాల కాట్లు, దురద, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగించబడుతుంది.
11. విష్ణుకాంత పత్రం( విష్ణుకాంత)
ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గించ డానికి, జ్ఞాపకశక్తి పెంపొందిం పజేయడానికి ఉపయోగపడుతుంది.
12. దాడిమీ పత్రం(దానిమ్మ)
ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు తగ్గించ డానికి ఉపయోగపడుతుంది.
13. దేవదారు పత్రం(దేవదారు)
ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గిం చడానికి ఉపయోగపడుతుంది.
14. మరువక పత్రం(మరువం)
ఇది జీర్ణశక్తి, ఆకలి పెంపొదించుటకు, జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించుటకు ఉపయో గపడుతుంది. దీనిని సువాసనకు ఉపయోగిస్తారు.
15. సింధూర పత్రం( వావిలి)
ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు,
గాయాలు, చెవిపోటు, మూరó వ్యాధి, ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయో గపడుతుంది.
16. జాజీ పత్రం( జాజి ఆకు)
ఇది వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటి పూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయో గపడుతుంది.
17. గండకీ పత్రం(దేవ కాంచనం)
ఇది మూర్ఛవ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు. నులి పురుగుల నివారణకు ఉపయో గపడుతుంది. దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.
18. శమీ పత్రం(జమ్మి ఆకు)
కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.
19. అశ్వత్థ పత్రం ( రావి ఆకు)
ఇది మల బద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు నివారించడానికి ఉపయోగ పడుతుంది. జీర్ణశక్తి, జ్ఞాపక శక్తి పెంపొందిం చడానికి సహకరిస్తుంది.
20. అర్జున పత్రం( తెల్ల మద్ది)
ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు,