Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం పనిచేస్తున్న నాయిని రాజేందర్‌రెడ్డికి వరంగల్ పశ్చిమ టికెట్ ఇవ్వాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కొలిపాక సతీష్ డిమాండ్ చేశారు. శనివారం డివిజన్ కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా పార్టీని వీడకుండా ఉండి కార్యకర్తలకు అండగా ఉన్న రాజేందర్‌రెడ్డికి సీటు కేటాయిస్తే విజయం సాధించడం ఖాయమన్నారు. పొత్తులో భాగంగా మిత్రపక్షాలు సీటు అడగడంతో తప్పులేదుగానీ ఆ సీటు రాజేందర్‌రెడ్డికి కేటాయిస్తేనే పార్టీ గెలుస్తుందని అన్నారు. సమావేశంలో కోటి, మధు తదితరులు పాల్గొన్నారు.